స్నానానికి వెళ్లి గొర్రెల కాపరి మృతి
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా: గొర్రెలు కాయడానికి వెళ్ళిన గొర్రెల కాపరి స్నానానికి వెళ్లి ఈత రాకపోవడంతో మృతి చెందిన సంఘటన మధ్యమానేరు జలాశయం కొదురుపాక వద్ద సోమవారం చోటుచేసుకుంది .
హెడ్ కానిస్టేబుల్ మురళి తెలిపిన వివరాల ప్రకారం చంద్రుర్తి మండలం జోగాపూర్ కు చెందిన సి పుల్లయ్య( 20 ) తన తల్లి వజ్రమ్మతో కలిసి వేములవాడలో నివాసం ఉంటున్నాడు.
జీవనోపాధి కోసం కొదురుపాక గ్రామానికి చెందిన కళ్లెం రాజయ్య వద్ద ఆరు నెలలుగా గొర్రెలు కాపరిగా పనిచేస్తున్నాడు.
సోమవారం గ్రామానికి చెందిన సాయిలు తో కలిసి గొర్రెలను మేపడానికి మధ్యమానెరు జలాశయంలోనికి వెళ్ళాడు.
మధ్యాహ్నం స్నానం చేయడానికి వెళుతున్నానీ అని సాయిలు తో చెప్పి సమీపంలోని గుంతలో స్నానానికి దిగాడు .
ఈత రాకపోవడంతో నీటిలో మునిగాడు.సాయిలు వెళ్లి చూడగా పుల్లయ్య చెప్పులు కర్ర ఇతర వస్తువులు కనిపించడంతో మత్స్యకారులకు సమాచారం అందించాడు.
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నీటిలో వెతికించగా పుల్లయ్య మృతదేహం దొరికిం.ది తల్లి వజ్రమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ తెలిపారు.