ఏడు కాళ్ల దూడ జననం కొద్దిసేపటి తర్వాత మృతి

సూర్యాపేట జిల్లా: సూర్యాపేట రూరల్ మండలం ఎర్కారం గ్రామానికి చెందిన రైతు మిద్దె సైదులుకు చెందిన గేదె మూడవ కాన్పులో ఏడు కాళ్ల దూడకు జన్మనిచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శుక్రవారం మధ్యాహ్నం గేదె పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానికులు అతి కష్టంపై ప్రసవం చేశారు.

పుట్టిన దూడకు ఏడు కాళ్లు ఉండటంతో వెంటనే వైద్యులకు సమాచారం అందించారు.సాధారణంగా నాలుగు కాళ్లతో పాటు మధ్యలో మూడు కాళ్లు అదనంగా వచ్చాయి.

గంట తర్వాత కూడా వైద్యులు రాకపోవడంతో వింత దూడ చనిపోయింది.జన్యు లోపం వల్ల ఇలాంటివి అప్పుడప్పుడు సంభవిస్తుంటాయని వైద్యులు తెలిపారు.

ఆ దూడను ట్రాక్టర్ పై తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

రోజుకు ప‌ది న‌ల్ల ఎండు ద్రాక్ష తింటే ఏం జ‌రుగుతుందో తెలుసా..?