సూరత్ సెషన్స్ కోర్టులో రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ

సూరత్ సెషన్స్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది.జైలు శిక్షపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్ ను డిస్మిస్ చేసింది.

మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు రెండేళ్ల పాటు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.

ఈ శిక్ష ఆధారంగా లోక్ సభలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది.

అయితే 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా దొంగల అందరి ఇంటి పేరు మోదీనే అంటూ రాహుల్ వ్యాఖ్యలు చేశారు.

ఈ వ్యాఖ్యలపై గుజరాత్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్… అసలు సినిమా ముందుంది అంటూ?