షర్మిలకు వరుస షాక్‌లు.. దీక్షకు రాని ప్రజలు.. చివరకు!
TeluguStop.com
దివంగత నేత, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వై.ఎస్.
రాజశేఖరరెడ్డి తనయ వై.ఎస్.
షర్మిల తెలంగాణ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.వైఎస్ఆర్‌టీపీ అధినేత్రిగా ప్రజల సమస్యలు తెలుసుకుంటానని, తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తానని ఈ నెల 8న పార్టీ ప్రారంభ సమయంలో చెప్పింది.
అయితే, ఆమె పార్టీకి కానీ ఆమె ప్రకటనలకు కానీ తెలంగాణ ప్రజానీకం నుంచి పెద్దగా స్పందన రావడం లేదు.
ప్రజా సమస్యలపై ఆమె రోడ్డెక్కుతున్నా ఆమె వెంట పది మంది నేతలు తప్ప ప్రజలు కనపించడం లేదు.
దీంతో పార్టీలో అంతర్గత మథనం స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది.ఈ నేపథ్యంలో షర్మిలకు తెలంగాణ ప్రజల నుంచి వరుసగా షాక్‌లు తగులుతున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
"""/"/
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు షర్మిల ఖమ్మంలో దీక్షకు దిగారు.
ప్రతీ మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తానని ప్రకటించిన సంగతి అందరికీ విదితమే.ఇందులో భాగంగా ఈ రోజు ఖమ్మంలోని పెనుబల్లి మండలం గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు షర్మిల.
నాగేశ్వరరావు చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకొని అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇకపోతే షర్మిల తెలంగాణ జిల్లా పర్యటనల్లోనూ జనం మచ్చుకైనా కనబడుట లేదు.దీక్షా స్థలికి వచ్చిన జనాన్ని చూస్తే కేవలం గల్లీ స్థాయి లీడర్ షర్మిల అని ఫిక్స్ అయిపోవచ్చనే విమర్శలూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్‌టీపీ రాజకీయం, పార్టీ భవిష్యత్తు, షర్మిల పరిస్థితి ఏంటనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో తలెత్తుతోంది.
షర్మిల తీరు చూస్తే పేరు గొప్ప.ఊరు దిబ్బ అన్నట్లు ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇందుకు నిదర్శనం నిరుద్యోగ దీక్షనే అని అంటున్నారు.కాగా, నిరుద్యోగ దీక్షా స్థలికి సదరు గ్రామ ప్రజలు కూడా రాకపోవడంతో ఆ ప్రాంత ప్రాంగణం ఖాళీగా ఉండటంతో ఆ ఫొటోలు తీసి కొందరు సోషల్ మీడియాలో వైస్‌ఆర్‌టీపీ తుస్.
అంటూ విమర్శలు చేస్తున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్23, సోమవారం2024