రోడ్డు దుస్థితిపై వైరల్ గా మారిన యువకుడి సెల్ఫీ వీడియో
TeluguStop.com
సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల మండలం బక్కయ్యగూడెం-గడ్డిపల్లి రోడ్డు పరిస్థితిని చూపిస్తూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో ద్వారా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి విన్నవించిన వీడియో నియోజకవర్గంలో శనివారం వైరల్ గా మారింది.
ఆ వీడియో ఆ యువకుడు మాట్లడుతూ బక్కయ్యగూడెం గ్రామం నుండి వివిధ అవసరాల నిమిత్తం బయటికి వెళ్ళాలంటే ఈ రోడ్డే ప్రధాన రహదారి.
ఈ రోడ్డుపై గడ్డిపల్లి వరకు వెళ్లి,అక్కడి నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది.
చినుకు పడితే చాలు చిత్తడైపోయి రైతులు,ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డును పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
గత సంవత్సరం నుండి ఎన్నిసార్లు మొరపెట్టుకున్న రోడ్డు బాగుపడలేదని, ఎమ్మెల్యేగా పలు గ్రామాలకు అభివృద్ధి పనులు చేయించి,ఈ రోడ్డును వదిలేశారని అన్నారు.
వర్షం పడితే ద్విచక్ర వాహనాలు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సైకిల్లు కదిలే పరిస్థితి లేదు.
మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఈ రోడ్డు ద్వారానే గడ్డిపల్లి వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది.
ఎమ్మెల్యేగా మా ఊరు రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరాడు.
ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!