దేశంలోకి సెల్ఫ్ డ్రైవింగ్ కారు వచ్చేసిందిగా… విశేషాలివే!
TeluguStop.com
కరోనా తరువాత దేశంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ కార్లు హవా ఎక్కువగా నడుస్తోంది.
అయితే త్వరలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా అందుబాటులోకి రానున్నాయి.ఇప్పటికే అక్కడక్కడా ఇతరదేశాలకు చెందిన కంపెనీల సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అందుబాటులో ఉన్నాయి.
కాగా దేశంలోనే మొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారును బెంగళూరుకు( Bangalore ) చెందిన 'మైనస్ జీరో'( Minus Zero ) సంస్థ తాజాగా ఆవిష్కరించింది.
అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో ఇప్పటికే వినియోగంలో ఉన్న సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు భారతదేశంలో కూడా త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.
"""/" /
మైనస్ జీరో కంపెనీ విడుదల చేయనున్న ఈ కారు మోడల్ పేరు 'జెడ్పాడ్' (zPod).
ఇది భారతీయ రోడ్ల మీద త్వరలోనే పరుగులు పెట్టబోతోంది.ఈ చూడటానికి చాలా చిన్నదిగా ఉంటుంది.
ఇది ఎలాంటి పరిస్థితుల్లో అయినా డ్రైవ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.ఇంకో విషయం ఏమంటే ఇందులో స్టీరింగ్ వీల్ అనేదే ఉండదు.
అయితే దీనికి బదులుగా అనేక హై - రిసొల్యూషన్ కెమెరాలు( High-resolution Cameras ) అందుబాటులో ఉండి, ట్రాఫిక్ సమయంలో డ్రైవింగ్ ఎనలైజ్ చేయడానికి అవి సహకరిస్తాయి.
"""/" /
ఇది లెవెల్ 5 అటానమీ( Level 5 Autonomy ) కలిగి ఉండటం వల్ల మనుషుల ప్రమేయం లేకుండానే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకి కదులుతుంది.
ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కావున వెహికిల్ని నావిగేట్ చేస్తుంది.అవసరమైనప్పుడు స్పీడ్ పెరుగుతుంది, ఏవైనా అడ్డంకులు వస్తే వాహనాన్ని ఆపివేస్తుంది.
ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కారు క్యాంపస్ లేదా పెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ వంటి క్లోజ్డ్ ఏరియాల్లో ఉపయోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ కారు గూగుల్ అండ్ టెస్లా కార్లకు ధీటుగా ఇండియాలో తయారుకాబోతోందని అంటున్నారు.
అయితే ఇది ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనే వివరాలను కంపెనీ ప్రస్తుతానికి వెల్లడించలేదు.