ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో నిరసనల సెగ

ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో నిరసన సెగ రాజుకుంది.పెను మార్పులకు శ్రీకారం చుట్టిన వైసీపీ తాజాగా పదకొండు నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జ్ లను నియమించిన సంగతి తెలిసిందే.

కొత్త సమన్వయకర్తల నియామకంతో పార్టీ నేతల్లో అసంతృప్త జ్వాల చెలరేగింది.ఈ క్రమంలో పాతవారినే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఏళ్ల తరబడి పార్టీలో ఉన్నవారికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికే మంగళగిరితో పాటు గుంటూరు, రేపల్లెలలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

రేపల్లెలో ఈవురు గణేశ్ సమన్వయకర్త నియామకాన్ని మోపిదేవి వర్గం వ్యతిరేకిస్తుండగా అటు గుంటూరు పశ్చిమలో మద్దాలగిరి వర్గం నుంచి అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

కెరియర్ మొదట్లో తేజను హేళన చేసిన వాళ్ళు ఎవరు..?