పిల్లి గీరడంతో మృతి చెందిన రష్యన్ వ్యక్తి.. షాక్‌లో ఫ్యామిలీ!

కొన్నిసార్లు మనం ఇష్టంగా పెంచుకునే జంతువులే మన ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయి.పెంపుడు జంతువులు కావాలని హాని తలపెట్టవు కానీ అనుకోకుండా జరిగే దృష్టకర సంఘటనలలో యజమానులు గాయపడుతుంటారు.

కొన్నిసార్లు వారు ప్రాణాలు కూడా కోల్పోతారు.ఇటీవల ఒక రష్యన్ వ్యక్తి( Russian ) తన పిల్లి( Cat ) గీరడం వల్ల తీవ్రగాయమై చనిపోయాడు.

ఈ విషాద సంఘటన కుటుంబ సభ్యులను తీవ్ర శోకంలోకి నెట్టింది.వివరాల్లోకి వెళ్తే, డిమిత్రి యుఖిన్( Dmitry Yukhin ) అనే ఆ వ్యక్తికి షుగర్ వ్యాధితో పాటు రక్తం గడ్డకట్టే సమస్య కూడా ఉంది.

ఈ ఆరోగ్య సమస్యల కారణంగా, చిన్న గాయాలు కూడా అతనికి ప్రాణాంతకంగా మారేవి.

నవంబర్ 22వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో, డిమిత్రి పెంపుడు పిల్లి ఇంటి నుంచి పారిపోయింది.

దీంతో ఆందోళన చెందిన డిమిత్రి, తన ఇంటి దగ్గర ఉన్న అడవిలో పిల్లిని వెతకడానికి వెళ్లాడు.

కొంత సేపటి తర్వాత పిల్లిని కనుగొన్నాడు.అయితే, పిల్లిని వెతుకుతున్న సమయంలో, పిల్లి అతని కాలిని గట్టిగా గీరింది.

దాంతో అతనికి గాయమై, దాన్నుంచి రక్తం కారడం మొదలయ్యింది. """/" / డిమిత్రి ఆరోగ్య పరిస్థితి చాలా త్వరగా క్షీణించింది.

అతనికి ఉన్న రక్తం గడ్డకట్టే సమస్య( Blood Clotting Disorder ) వల్ల, గాయం నుండి కారుతున్న రక్తాన్ని ఆపడం అసాధ్యమైంది.

వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం ఫోన్ చేసినప్పటికీ, అంబులెన్స్ సకాలంలో చేరుకోలేదు.

అధిక రక్తస్రావం కారణంగా డిమిత్రి కొన్ని నిమిషాల వ్యవధిలో మృతి చెందాడు.ఈ ఘటనకు సాక్ష్యంగా ఉన్న వారు, డిమిత్రి పిల్లి చాలా పెద్దదని, దాని చేసిన గాయం చాలా లోతుగా ఉందని తెలిపారు.

కుటుంబ సభ్యులు, పొరుగువారు ఈ మృతితో తీవ్ర షాక్‌కు గురయ్యారు.ఆ పిల్లి తమకు చాలా ఇష్టమైన పెంపుడు జంతువు అని, ఇలాంటి విషాదం జరుగుతుందని తాము ఎప్పుడూ అనుకోలేదని వారు చెప్పారు.

"""/" / ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు పెంపుడు జంతువుల దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఘటన తెలియజేస్తోంది.

పెంపుడు జంతువులు మనకు మంచి స్నేహితులు అయినా, అవి కొన్నిసార్లు అనూహ్యంగా ప్రవర్తించవచ్చు.

కెనడాలో ముగిసిన కాన్సులర్ క్యాంప్‌లు .. ఊపిరి పీల్చుకున్న ఇండియన్ ఎంబసీ