గుంటూరు జిల్లాలో కిడ్నాప్ కు గురైన బియ్యం వ్యాపారి హత్య..!

గుంటూరు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.పొన్నూరులో కిడ్నాప్ కు గురైన బియ్యం వ్యాపారి హత్యకు గురైయ్యాడు.

వ్యాపారి బర్మా బాసు అంజిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే, మచిలీపట్నం శివారులోని గుండేరు కాలువలో ఓ మృతదేహం లభించింది.

అక్కడి పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వ్యక్తిగా కేసు నమోదు చేశారు.అనంతరం మృతదేహంపై ఆనవాళ్లను బట్టి అంజి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

ఈ క్రమంలో ఆ మృతదేహం అంజిదిగా కుటుంబ సభ్యులు గుర్తించారు.హత్య చేసి కాలువలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.హత్యకు గల కారణాలు, కిడ్నాపర్లు ఎవరూ అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.