లోన్ యాప్ వలలో చిక్కి 1.7 లక్షలు పోగొట్టుకున్న సిద్దిపేట వాసి..!

లోన్ యాప్ మోసాలతో అమాయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఇంతకాలం వరకు కేవలం సైబర్ మోసాలు ( Cyber ​​fraud )నగరాలు మాత్రమే పరిమితం అయ్యేవి.

కానీ ఇప్పుడు గ్రామాలకు సైతం పాకుతూ అమాయక ప్రజల సొమ్మును చాకచక్యంగా కొట్టేస్తున్నారు.

ప్రజలకు మోసం చేయడానికి ఎన్నో కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తూ, ఎంత తెలివైన వాళ్లు కూడా ఏదో ఓ సందర్భంలో మోసాలకు గురై సర్వం కోల్పోతున్నారు.

ఏదో ఓ నెంబర్ నుండి ఫోన్ చేయడం, మీకు లోన్ మంజూర అయిందని నమ్మించడం, వారికి కావలసిన వివరాలు సేకరించి ఖాతాలో డబ్బులను మాయం చేయడం సైబర్ కేటుగాళ్ల పని.

తాజాగా సిద్దిపేటలోని ఓ వ్యక్తికి గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్ వచ్చి, లోన్ మంజూరైందని చెప్పి లోన్ అమౌంట్ పొందడానికి ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని మాయ మాటలు చెప్పాడు.

అవతల వ్యక్తి మాటలు నమ్మిన బాధితుడు ఫోన్ పే, గూగుల్ పే( Phone Pay, Google Pay ) ద్వారా కొంత మొత్తం అవతల వ్యక్తికి చెల్లించాడు.

పలుసార్లు పలు కారణాలు చెప్పి బాధితుడి నుండి ఏకంగా లక్ష ఏడువేల రూపాయలు చెల్లించుకున్నాడు.

తరువాత వెంటనే ఫోన్ కాల్ కట్ అవడంతో బాధితుడు లోన్ అమౌంట్ ఖాతాలో ఎప్పుడు పడుతుందని తిరిగి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయిన విషయం గ్రహించి పోలీసులను ఆశ్రయించాడు.

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.కామారెడ్డి( Kamareddy ) జిల్లాలో కూడా ఇలాంటి కోవకు చెందిన ఓ ఘరానా మోసం జరిగింది.

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో నివసించే సతీష్ అనే వ్యక్తికి బజాజ్ ఫైనాన్స్ లో రెండు లక్షల లోన్ మంజూర్ అయిందని గుర్తు తెలియని వ్యక్తి నుండి కాల్ వచ్చింది.

ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని ఇతని వద్ద కూడా ఫోన్ పే ద్వారా కొన్ని విడతల రూపంలో ఏకంగా 85 వేల రూపాయలు చెల్లించుకొని వెంటనే అవతల వ్యక్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు.

తాను కూడా చివరికి పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది.దేవునిపల్లి ఎస్ఐ ప్రసాద్ మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చిన కాల్స్ ప్రమాదమని, అటువంటి కాల్స్ వచ్చినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు చెల్లించకుండా పోలీసులకు తెలియజేయాలని సూచించారు.

ట్రిపుల్ రోల్ లో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోలు వీరే !