గంజాయి వినియోగంపై నిఘా పెంచాలని వినతి

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజవర్గంలో గంజాయి అక్రమ రవాణా కొనసాగిస్తూ హుజూర్ నగర్,నేరేడుచర్ల మున్సిపాలిటీలపరిధిలో పెద్ద ఎత్తున యువత గంజాయికి అలవాటు పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో మంగళవారం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ లో సామాజిక కార్యకర్తలు గంజాయి వినియోగంపై నిఘా పెంచాలని కోరుతూ ఎస్సై నవీన్ కి వినతిపత్రం అందజేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ గంజాయి వినియోగం క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందని,ఈ నేపథ్యంలో గంజాయి మీద తీవ్ర యుద్ధాన్ని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.

ఇటీవల హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంగా గంజాయి తరలింపు కేసులు నమోదవుతున్నాయని,నేరేడుచర్ల మున్సిపాలిటీ కేంద్రంలో కూడా యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోందని అన్నారు.

మత్తుకు బానిసలై యువకులు నిండు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా గంజాయి తరలింపుపై గట్టి నిఘా పెంచి యువకుల జీవితాలను కాపాడాలని కోరుతూ వినతిపత్రం సమర్పించామన్నారు.

ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సుంకరి క్రాంతి కుమార్,కొప్పు రామకృష్ణ గౌడ్,జింకల భాస్కర్,సురేష్,నాగరాజు,శ్రవణ్,శివశంకర్ పాల్గొన్నారు.

పోట్లాడుకుంటున్న ఆవులు.. అడ్డొచ్చిన అమ్మాయిలను కుమ్మేశాయిగా.. వీడియో వైరల్..!