సముద్ర తీరానికి కొట్టికొచ్చిన్న అరుదైన నీలి తిమింగళం( బ్లూ వేల్ )..

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పాత మేఘవరం సముద్ర తీరానికి అరుదైన చనిపోయిన నీలి తిమింగళం ( బ్లూ వేల్ ) కొట్టికొచ్చింది.

సుమారు 25 అడుగులు పొడవు 5 టన్నులు బరువు ఉంటుంది.అయితే ఈ చేపలు బంగాళాఖాతంలో చాలా అరుదుగా ఉంటాయని, లోతులేని నీటిలో చేరి చనిపోయి ఉండవచ్చు అని మత్స్యకారులు భావిస్తున్నారు.

అయితే భూమిపై ఉన్న అత్యంత భారీ జాతులలో ఇది ఒకటి.అయితే ఇది సుమారుగా 5 టన్నులు మాత్రమే ఉండడం వలన ఇది ఆ జాతి చేప పిల్లగా భావిస్తున్నారు.

ఈ చేప ఒడ్డుకు చేరిందని సోషల్ మీడియాలో వైరల్ అవడంతో చేపను చూసేందుకు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు సముద్రతీరానికి తరలివచ్చారు.

పాక్ నటుడి నోట భారత మాట.. దీపక్ పెర్వానీ వ్యాఖ్యలపై మండిపడుతున్న నెటిజన్లు..