అమెరికాలో ప్రముఖ ఎన్నారై శ్రీనివాస మానా ప్రగాడ కు అరుదైన అవార్డు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలకు వేరే దేశాల ప్రజలు జీవించడానికి వలసలు వెళుతూ ఉంటారు.

అందులో ముఖ్యంగా భారతదేశ ప్రజలు ఎక్కువగా అగ్రరాజ్యమైన అమెరికాకు వలస వెళ్లి జీవిస్తూ ఉంటారు.

అలా వెళ్ళిన వారిలో కొంతమంది ఆ దేశ ప్రముఖ అవార్డులను సొంతం చేసుకుని మన దేశ కీర్తిని ఎక్కడికో తీసుకొని వెళుతూ ఉంటారు.

తాజాగా అమెరికాలో ప్రముఖ ఎన్నారై శ్రీనివాస మానాప్రగడకు అరుదైన గౌరవం లభించింది.పేదలకు అండగా నిలుస్తున్న ఆయన్ను ప్రెసిడెంట్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఫర్ కమ్యూనిటీ సర్వీస్ అండ్ వాలంటరీ అవార్డ్ దక్కింది.

"""/"/ లాస్ వేగాస్ లోని కాస్మోపాలిటన్ ఆఫ్ లాస్ట్ వేగాస్ హోటల్లో జరిగిన తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ బోర్డ్ సమావేశంలో అమెరికా చట్టసభల సభ్యుడు రోకన్నా చేతుల మీదుగా శ్రీనివాస మానాప్రగడ ఈ అవార్డును అందుకోవడం విశేషం.

ఈ సందర్భంగా శ్రీనివాస మానప్రగడ మీడియాతో మాట్లాడుతూ తనను ఈ ప్రపంచానికి తీసుకొచ్చిన తన తండ్రి జానపద బ్రహ్మ మన ప్రగడ నరసింహమూర్తి తల్లి రేణుకాదేవి మన ప్రగడలకు రుణపడి ఉంటాను అని తెలిపారు.

తనకు ఈ అవార్డు దక్కడం వెనుక భార్య కవిత, కుమారులు సింహ, మణిహార్, యువరాజ్, సోదరుడు లక్ష్మి, మేనకోడలు హిమశ్రీల ప్రోత్సాహం ఎంతో ఉందని వెల్లడించారు.

"""/"/ డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి మార్గదర్శకులు కూడా డాక్టర్ విజయపాల్ రెడ్డి, డాక్టర్ హరినాథ్, డాక్టర్ మోహన్ పట్లోలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.

స్థానిక ప్రముఖులు తన శ్రేయోభిలాషులైన ఆనంద్ కూచిపుట్ల జయరాం కోమటి, డాక్టర్ రమేష్ జాఫర్, రమేష్ తంగెళ్లపల్లి, భారత్ మాదాడి వెంకటయ్య, అక్క అనిల్ అరవెల్లి, వంశి రెడ్డి, సరస్వతి, నంద శ్రీరామ ప్రసాద్, రావినీతి సోహెల్, అమిత్ తన వెనుక ఉండి ఎంతో ప్రోత్సహించారని ఈ సందర్భంగా తెలియజేశారు.

తన ఆహ్వానాన్ని మన్నించి కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ గౌరవ సభ్యులు నాకు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా అభినందిస్తూ నిరుపేదలను ఆదుకోవడంలో ఆయన చేస్తున్న కృషి ఎంతో గొప్పదని ఆయనను ప్రశంసించారు.

యోగి ఆదిత్యనాథ్‌ను ఆకట్టుకున్న ఇటాలియన్ మహిళలు.. ఏం చేశారో చూడండి!