వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
TeluguStop.com

వరంగల్ జిల్లాలోని కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం చెలరేగింది.ఈ మేరకు మెడికో విద్యార్థిని సీనియర్లు విచక్షణారహితంగా కొట్టారని తెలుస్తోంది.


ఘటనపై కేసు నమోదు చేసిన మట్వాడ పోలీసులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.సుమారు పది మంది విద్యార్థులు ర్యాగింగ్ కు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.


కేఎంసీ ఆవరణలో ఈనెల 14న పుట్టినరోజు వేడుకల సందర్భంగా ర్యాగింగ్ ఘటన చోటు చేసుకుందని సమాచారం.
కాగా పది మంది సీనియర్ మెడికోలపై ఏడాది పాటు వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం క్రమశిక్షణ కమిటీ సమావేశం నిర్వహించిన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకోనున్నారు.
దుబాయ్ వెళ్లేందుకు రూల్స్ మరీ ఇంత కఠినమా.. చిన్నారికి నో ఎంట్రీ.. ఎయిర్‌పోర్ట్‌లో రచ్చ!