డార్క్ సర్కిల్స్ మీ అందాన్ని చెడగొడుతున్నాయా.. ఇలా చేస్తే వారంలో మాయం అవుతాయి!
TeluguStop.com
డార్క్ సర్కిల్స్.చాలా మంది ఫేస్ చేసే కామన్ సమస్యల్లో ఇది ఒకటి.
మొబైల్ ఫోన్ ను అధికంగా వినియోగించడం, గంటలు తరబడి కూర్చుని పని చేయడం, అతిగా టీవీ చూడటం, ఆహారపు అలవాట్లు, కంటి నిండా నిద్ర లేకపోవడం, ఒత్తిడి తదితర కారణాల వల్ల కళ్ల చుట్టూ నల్లటి వలయాలు ఏర్పడుతుంటాయి.
ఇవి అందాన్ని చెడగొడతాయి.మనలోని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.
అందుకే డార్క్ సర్కిల్స్ వదిలించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.
? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే కేవలం వారం రోజుల్లో డార్క్ సర్కిల్స్ ( Dark Circles )మాయం అవుతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee Powder ) వేసి పది నిమిషాల పాటు మరిగించాలి.
ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి కాఫీ డికాక్షన్ ను ఫిల్టర్ చేసుకుని చల్లార బెట్టుకోవాలి.
"""/" /
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఒక కప్పు కాఫీ డికాక్షన్ వేసుకోవాలి.
అలాగే ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు పచ్చిపాలు( Raw Milk ), రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్, వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని అన్ని కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ జ్యూస్ ను ఐస్ ట్రే లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.
ఐదు గంటల తర్వాత తయారైన ఐస్ క్యూబ్స్ ను తీసుకుని కళ్ళ చుట్టూ స్మూత్ గా రబ్ చేసుకోవాలి.
"""/" /
ఆపై పది నిమిషాల పాటు చర్మాన్ని ఆరబెట్టుకుని.అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే డార్క్ సర్కిల్స్ దెబ్బకు మాయం అవుతాయి.
కళ్ళ చుట్టూ నల్లటి వలయాలను సమర్థవంతంగా నివారించడానికి ఈ రెమెడీ ఉత్తమంగా సహాయపడుతుంది.
కాబట్టి డార్క్ సర్కిల్స్ సమస్యతో వర్రీ అవుతున్న వారు తప్పకుండా ఈ మ్యాజికల్ హోమ్ రెమెడీని పాటించేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.
సికిందర్ మూవీ తొలిరోజు కలెక్షన్ల లెక్కలివే.. బాలీవుడ్ ఇండస్ట్రీ పరిస్థితి ఇంత దారుణమా?