పైలట్ ప్రాజెక్టు భూ సర్వే ఎల్లాపురం శివారులో షురూ

నల్లగొండ జిల్లా:తిరుమలగిరి (సాగర్) మండలంలోని ఎల్లాపురం గ్రామ శివారులో ఎల్లాపురం తండా,సుంకిశాల తండా గిరిజన రైతులకు భూముల సర్వే టీం లీడర్ నిడమనూర్ ఎమ్మార్వో కృష్ణయ్య ఆధ్వర్యంలో సర్వే ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు,గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్ర శంకర్ నాయక్, కేతవత్ రామకృష్ణ నాయక్ తెలిపారు.

మంగళవారం రెవిన్యూ అధికారులు ఫారెస్ట్ అధికారులతో సుంకిశాల తండా రిహాబిటేషన్ సర్వే నెంబర్లు 1నుంచి 57,సర్వే నెంబరు 255 సరిహద్దులకు గుర్తించడానికి పరిశీలించారు.

ధరణిలో ఉన్న లోపాలను సరి చేయడానికి తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి,ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు లింగారెడ్డి,మా గ్రామ రైతుల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

ఎల్లాపురం గ్రామ శివారులో రెవిన్యూ ఫారెస్ట్ హద్దులు లేక అనేక సంవత్సరాల నుంచి ఫారెస్ట్ అధికారులకు గిరిజన రైతులకు మధ్య గొడవలు జరుగుతున్నాయని,ఈ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా భూ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో సర్వేయర్లు విజయ్,లక్ష్మణ్,ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ గిరి,ఉప సర్పంచ్ రవీందర్,గిరిజన కార్మిక విభాగ జిల్లా అధ్యక్షుడు కెతావత్ నాగేష్ నాయక్,మాజీ సర్పంచ్ బీమ్లా నాయక్,బిచ్చనాయక్ ఎంపీటీసీ దేవు నాయక్, రమావత్ లాలూనాయక్, హనుమంతు,హాథిరామ్ నాయక్,సోమ్లా నాయక్, మత్తు,దేవా,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

టాన్ ను పోగొట్టి 20 నిమిషాల్లో ముఖాన్ని బ్రైట్ గా మార్చే రెమెడీ మీ కోసం!