ముంబై స్టేట్ బ్యాంక్ పై బాంబు దాడి చేస్తాం అంటూ పాకిస్తాని బెదిరింపు ఫోన్ కాల్

మహారాష్ట్ర రాజధాని ముంబైలోని నారిమన్‌ పాయింట్‌లో ఉన్న ఎస్‌బీఐ కార్యాలయాన్ని పేల్చేస్తామని, బ్యాంక్ మేనేజర్‌ను చంపేస్తామని బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

తాను పాకిస్తాన్‌ నుంచి మాట్లాడుతున్నానని, తన పేరు ఎండీ జియా ఆల్ అలిమ్‌ అని బ్యాంకు అధికారులకు పరిచయం చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

తనకు లోన్ ఇవ్వాలని, లేని పక్షంలో బ్యాంక్ చైర్మన్‌ను కిడ్నాప్ చేసి హతమారుస్తానని బెదిరించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

అవసరమైతే బ్యాంకును కూడా పేల్చేస్తానని ఆ వ్యక్తి బెదిరింపులకు గురి చేసినట్లు తెలిపారు.

అయితే సదరు వ్యక్తి అక్టోబర్ 13వ తేదీన ఉదయం 11 గంటలకు బ్యాంకు ల్యాండ్‌ లైన్‌ నంబర్‌కు ఫోన్ చేసినట్లు తేలింది.

బ్యాంక్‌కు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు మెరైన్ డ్రైవ్ పోలీసు స్టేషన్ పోలీసులు పేర్కొన్నారు.

గేమ్ చేంజర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టారా..?