చైతన్య శోభిత తొలిసారి అప్పుడే కలిశారట.. ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ శోభిత ధూళిపాళలు( Naga Chaitanya , Sobhita Dhulipala ) ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.
గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్న ఈ జంట ఇటీవలే వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు.
ఇటీవలే వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్( Annapurna Studios ) లో జరిగిన విషయం తెలిసిందే.
ఇరువురి కుటుంబ సభ్యులు సన్నిహితులు స్నేహితులు అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం ఈ పెళ్లికి హాజరయ్యారు.
ఇది ఇలా ఉంటే తాజాగా శోభిత తన ప్రేమ ప్రయాణం గురించి ఎప్పుడూ ఎక్కడ కలిశారు అన్న విషయాల గురించి చెబుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
ఈ మేరకు శోభిత మాట్లాడుతూ. """/" /
2018 లో నేను నాగార్జున గారి ఇంటికి వెళ్లాను.
2022లో నాగచైతన్యతో నాకు పరిచయం ఏర్పడింది.మొదటిసారి మేము ముంబైలో కలిసాము.
నేను రెడ్ డ్రెస్ లో ఉన్నాను.2022 నుంచి నేను చైతన్యని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవుతున్నాను.
మేము ఎప్పుడు కలిసినా కూడా ఫుడ్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళం.మేము కలిసిన ప్రతిసారి నాగచైతన్య నన్ను తెలుగులో మాట్లాడమని అడిగేవాడు.
తనకు తెలుగు బాగా మాట్లాడేవారు అంటే ఇష్టం అని తెలిపింది శోభిత.అలా తెలుగులో మాట్లాడిన ప్రతిసారి మా బంధం మరింతగా బలపడింది.
"""/" /
నేను ఇన్స్టా లో పోస్ట్ చేసే గ్లామర్ ఫొటోస్ కాదు కానీ నేను పోస్ట్ చేసే స్ఫూర్తివంతమైన పోస్ట్ లను చైతు లైక్ చేసేవారు.
మేము పరిచయమైన సమయంలో నేను ముంబై, చైతు హైదరాబాద్ లో ఉండేవాళ్ళం, నన్ను కలిసేందుకు చైతు తరచూ ముంబై వచ్చేవారు.
తర్వాత కర్ణాటక లోని ఒక పార్క్ కి వెళ్ళాం, అక్కడ చాలాసేపు మట్లాడుకున్నాము, ఒకరికొకరు గోరింటాకు పెట్టుకున్నాము.
తర్వాత చైతు ఫ్యామిలీ నన్ను న్యూ ఇయర్ వేడుకల కోసం ఆహ్వానించారు, తర్వాత ఏడాది చైతు మా ఫ్యామిలీని కలిశారు.
గోవాలో మా పెళ్లి ప్రతిపాదన వచ్చింది, మా ఇద్దరి మనసులు కలిసాయి.అమెజాన్ ప్రైమ్ ఈవెంట్ లో కలిసినప్పటినుంచి అంతా మీకు తెలుసు అంటూ శోభిత చైతు తో ప్రేమ ప్రయాణం పై కామెంట్స్ చేసింది.
ఈ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ కామెంట్స్ పై వారి లవ్ స్టోరీ పై అక్కినేని అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు.