బస్సు దిగుతూ వెనుక టైరు క్రింద పడ్డ ప్రయాణికుడు

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ఆర్టీసి బస్టాండ్( RTC Bus Stand) లో గురువారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది.

కోదాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికులని ఎక్కించుకొని సూర్యాపేట బస్టాండ్ నుండి కోదాడ( Kodad Bus Depot ) బయలుదేరిన కొద్దిసేపటికే ఒక ప్రయాణికుడు బస్సు దిగుతూ కిందపడగా అతని కాలుపైనుండి వెనుక టైర్ వెళ్లడంతో కాలు నుజ్జునుజ్జు అయింది.

వెంటనే స్థానికులు గమనించి అతన్ని అంబులెన్స్ సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రి( Government Hospital )కి తరలించారు.

గాయపడిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది.

డాకు మహారాజ్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమెంత?