రజనీకాంత్ పాటకి అదిరిపోయే డ్యాన్స్ చేసిన చిలుక.. వీడియో వైరల్..

సంగీతం వింటూ ఒక చిలుక(parrot) చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichande) కంపోజ్ చేసిన, సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth) పుట్టినరోజు సందర్భంగా విడుదలైన 'కూలీ' (Coolie )సినిమాలోని 'చికిటు వైబ్'(Chikitu Vibe) పాటకు ఆ చిలుక తన్మయత్వంతో ఊగిపోతూ స్టెప్పులేసింది.

ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.రంగురంగుల ఈ చిలుక 'చికిటు వైబ్'(Chikitu Vibe) పాట బీట్‌కు అనుగుణంగా తల ఊపుతూ, ఎంతో ఉత్సాహంగా కదులుతూ కనిపించింది.

పాటలోని జోష్‌కు తగ్గట్టు చిలుక హావభావాలు ఉండటంతో ఈ వీడియో అందరికీ నవ్వు తెప్పిస్తోంది.

పాటను ఇష్టపడేవారు, జంతు ప్రేమికులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

కొందరు "ఈ చిలుక నాకంటే బాగా డాన్స్ చేస్తోంది!" అని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.

మరికొందరు పాట బీట్‌కి తగ్గట్టు చిలుక (parrot)కదులుతున్న విధానాన్ని మెచ్చుకుంటున్నారు.ఈ వీడియో మీమ్స్‌కి, షార్ట్ క్లిప్స్‌కి కూడా స్ఫూర్తినిచ్చింది.

ఇతర జంతువులు సంగీతానికి ఎలా స్పందిస్తాయో ఊహిస్తూ చాలామంది వీడియోలు చేస్తున్నారు. """/" / 'చికిటు వైబ్' అనే పాట చాలా ఊపున్న ట్యూన్ తో సాగుతుంది, అలానే రజనీకాంత్‌(Rajinikanth) ప్రజెన్స్‌ తో ఇప్పటికే పెద్ద హిట్ అయింది.

చిలుక చేసిన డ్యాన్స్ దానికి మరింత క్రేజ్, హైప్ తెచ్చి పెట్టింది.సంగీతం మనుషుల్నీ, జంతువుల్నీ కూడా డాన్స్ చేపిస్తుందని చెప్పడానికి ఇదొక నిదర్శనం.

ఈ చిన్న వీడియో చాలా మందికి నవ్వునీ, సంతోషాన్నీ పంచింది.సంగీతం నిజంగా యూనివర్సల్ లాంగ్వేజ్ అనీ, దాన్ని చిలుక కూడా ఆస్వాదించగలదనీ ఇది నిరూపిస్తోంది.

ఈ ఫన్నీ చిలుక వీడియోను మీరు కూడా చూసేయండి.

నాగార్జున వందో సినిమా దర్శకుడు ఎవరో తెలిసిపోయిందా..?