ఇదేందయ్యా ఇది.. కూతురి తలపై సీసీటీవీ అమర్చిన తండ్రి.. ఎందుకంటే.?

ఈ మధ్యకాలంలో కొందరు పనులు వారి సొంత ప్రయోజనాల కోసం చేస్తారో.? లేకపోతే సోషల్ మీడియాలో ఫేమస్ కావాలని చేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది.

రాత్రికి రాత్రి సోషల్ మీడియాలో వైరల్ గా మారి పేరు తెచ్చుకోవాలని చాలామంది చిత్ర విచిత్ర పనులు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ అమ్మాయిపై సీసీటీవీ( CCTV ) అమర్చిన ఘటన ఒకటి వైరల్ గా మారింది.

సాధారణంగా, భద్రతా ప్రయోజనాల కోసం బహిరంగ ప్రదేశాలు, కంపెనీలు, ఇంకా ఇళ్లలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం కామన్ గా మారింది.

అయితే., ఇక్కడ ఓ వ్యక్తి తన కూతురి( Daughter ) తలపై కిరీటంలా సీసీటీవీని అమర్చగా, ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కూతురు ఎక్కడికి వెళుతుంది.? తన కూతురు ఏం చేస్తుందో.

? తెలుసుకోవడానికి ఆమె తలపై సీసీటీవీ కెమెరా అమర్చినట్లు సమాచారం. """/" / పాకిస్థాన్‌లో( Pakistan ) జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సర్వత్రా హల్‌చల్ చేస్తోంది.

వైరల్ వీడియోలో,( Viral Video ) యువతి తన తండ్రి తనను 24/7 పర్యవేక్షించడానికి సీసీటీవీని అమర్చినట్లు చెప్పింది.

అంతే కాకుండా తండ్రి తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తాను సంతోషంగా ఉన్నానని చెప్పడం విడ్డురం.

@gharkekalesh అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ చేయబడింది.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ వీడియోపై చాలామంది రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. """/" / ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ అమ్మాయి స్వాతంత్రాన్ని కెమెరాలో బంధించాలని భావిస్తున్నారా.

? అని కొందరు కామెంట్ చేస్తుండగా.ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.

ఏదేమైనా ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు.? మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి.

2000 మంది ఉన్నారు…తేడా వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతారు: జగపతిబాబు