తెలుగుదేశం పార్టీ నూతనంగా మొదలుపెట్టిన రేడియో కార్యక్రమం..

తెలుగుదేశం పార్టీ నూతనంగా ఒక కార్యక్రమం మొదలుపెట్టింది వివరాల్లోకి వెళ్తే మొన్న గన్నవరంలో వైసీపీ చేసిన దమనకాండ నీ , తెలుగుదేశం నాయకులు , కార్యకర్తల పై పోలీసుల జులుంని నిరసిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశిస్తూ ఒక బహిరంగ లేఖను వ్రాయడం జరిగింది ఈ లేఖను , రాష్ట్ర ప్రజానీకానికి అధినేత సందేశాన్ని ప్రజలకి మరింత చేరువ చేయడానికి రేడియో పేరుతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇక మీద అధినాయకుడు మరియు ముఖ్య నాయకుల సందేశాలను వాయిస్ ఓవర్ రూపంలో సోషల్ మీడియాలో మరింత చేరువ చేస్తామంటూ తెలిపారు.

ఇదే కార్యక్రమాన్ని యువగలం పాదయాత్రలో సైతం అమలు చేయుటకు ఆలోచన జరుగుతుందనీ తెలియజేశారు.

కాగా వినూత్నంగా చేస్తున్న ఈ కార్యక్రమం నెటిజన్లను ఆకట్టుకుంటుంది.మారుతున్న కాలానికి అనుగుణంగా తమ నాయకుడు సందేశాన్ని వినడానికి ప్రజలు ఆసక్తిగా వున్నారు.

మార్నింగ్ వాక్‌, ఈవెనింగ్ వాక్‌.. రెండింటిలో ఏది ఆరోగ్యానికి బెస్ట్‌..?