ఇన్ స్టాగ్రామ్ లో కొత్త ఫీచర్.. ఇకపై అలాంటి వాటికి చెక్..!

ఇన్ స్టాగ్రామ్ ( Instagram ) లో అసభ్యకరమైన కంటెంట్లు వీడియోల, ఫోటోల రూపంలో పోస్ట్ అవుతున్న సంగతి తెలిసి తెలిసిందే.

అయితే ఇలాంటి అసభ్యకర కంటెంట్లను టీనేజర్లు చూడకూడదని ఉద్దేశంతో ఇన్ స్టాగ్రామ్ లో ఓ సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానుంది.

టీనేజ్ లో ఉండే యువతకు నగ్నత్వానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు( Videos, Photos ), ఇంకా హానికరమైన కంటెంట్లు ఇన్ స్టాగ్రామ్ లో కనిపించకుండా ఉండేందుకు మెషీన్ లెర్నింగ్ ను పరీక్షిస్తోంది.

ఒకవేళ పొరపాటున ఇన్ స్టాగ్రామ్ యూజర్లు ఎవరైనా అవుతలి వ్యక్తులకు అసభ్యకరమైన ఫోటోలు పంపించడానికి ప్రయత్నిస్తే, వెంటనే ఒకసారి ఆలోచించండి అంటూ యూజర్లకు ఒక వార్నింగ్ అలర్ట్ వస్తుంది.

ఆ తర్వాత ఆన్ డివైస్ మెషిన్ లెర్నింగ్ ( On-device Machine Learning )ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్లను విశ్లేషిస్తుంది.

"""/" / ఇన్ స్టాగ్రామ్ లో ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే టీనేజ్ లో ఉండే యువతకు అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు కనిపించే అవకాశం ఉండదు.

ఇన్ స్టాగ్రామ్ లో అసభ్యకరమైన కంటెంట్లు క్రమంగా పెరుగుతున్నాయని, టీనేజ్ లో ఉండే యువత ఇలాంటి కంటెంట్ కు అట్రాక్ట్ అవుతున్నారని యునైటెడ్ స్టేట్స్, యూరప్ ప్రజల నుండి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో, ఇన్ స్టాగ్రామ్ లో ఇలాంటి అసభ్యకరమైన కంటెంట్లకు అడ్డుకట్ట వేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

"""/" / ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చాక 18 ఏళ్లలోపు యూజర్లకు ఈ ఫీచర్ ఆటోమేటిగ్ గా ఆన్ లోనే ఉంటుంది.

ఈ ఫీచర్ ఆన్ లో ఉంటే అసభ్యకరమైన కంటెంట్లు వారికి కనిపించవు.18 ఏళ్లు నిండిన వారు ఈ ఫీచర్ ను మ్యానువల్ గా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది.త్వరలోనే ఇన్ స్టాగ్రామ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

చంద్రబాబు క్లారిటీతో ఉన్నారా ? అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారా ?