పొలంలో ఎరువులు వేసేందుకు సరికొత్త పరికరం.. ఈ రైతు ఐడియా భేష్..!
TeluguStop.com
వ్యవసాయ రంగంలో ఎన్నో అధునాతన మార్పులు అందుబాటులోకి వచ్చాయి.అయితే వ్యవసాయంలో కొన్ని మెలకువలు పాటిస్తే శ్రమతో పాటు పెట్టుబడి తగ్గుతుంది.
అధిక దిగుబడి పొంది మంచి లాభాలు పొందవచ్చు.ప్రస్తుతం వ్యవసాయ రంగంలో( Agriculture ) కూలీల కొరత పెరుగుతూ ఉండడంతో వ్యవసాయ పెట్టుబడి అనేది విపరీతంగా పెరిగిపోయింది.
దీంతో సంవత్సరం అంతా కష్టపడిన రైతుకు చివరికి ఆదాయం శూన్యం.ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకున్న ఒక రైతు పొలంలో ఎరువులు చల్లడానికి తక్కువ ఖర్చుతో ఒక కొత్త పరికరాన్ని రూపొందించాడు.
ఈ పరికరంతో తగిన మోతాదులో పంట మొక్కలకు ( Crop Plants )ఎరువులు అందించవచ్చు.
ఈ పరికరం వల్ల కాస్త కూలీల ఖర్చు తగ్గడంతో పాటు ఎరువులు కూడా వృధా అవ్వకుండా ఉంటుంది.
ఒక నాగలికి వాటర్ బబుల్ ను తలక్రిందులుగా పెట్టి ఆరు ఇనుప రాడ్లని వెల్డింగ్ చేశాడు.
వాటర్ బబుల్( Water Bubble ) కింద భాగంలో పెద్ద రంధ్రం చేశాడు.
వాటర్ బబుల్ పై భాగంలో గేట్ వాల్వ్ ఏర్పాటు చేశాడు.ఈ గేట్ వాల్వ్ తో ఎరువులను కావలసిన మోతాదులో పొలంలో వేసుకోవచ్చు.
ఈ వాటర్ బబుల్ కు కింది భాగంలో పైపు గొట్టాలు అమర్చబడి ఉన్నాయి.
ఈ పరికరం సహాయంతో ఎరువు వేస్తే, అది మొక్కల వేర్ల దగ్గర పడుతుంది.
"""/" /
ఈ పరికరాన్ని నడిపించడానికి కేవలం ఒక వ్యక్తి ఉంటే చాలు.
ఈ పరికరం ఒకవైపు నాగలి దున్నుతూ, మరోవైపు ఎరువులు మొక్కలకు అందిస్తుంది.ఈ పరికరం తయారు చేయడానికి కేవలం 500 రూపాయలు ఖర్చు అవుతుంది.
ఎరువులు వేయడానికి మార్కెట్లో సీడ్ కం ఫర్టిలైజర్ డ్రిల్స్ ( Seed Cum Fertilizer Drills )చాలానే ఉన్నాయి కానీ వాటి ఖరీదు చాలా ఎక్కువ.
రైతులు కాస్త ఆలోచించి ఇలాంటి సరికొత్త పరికరాలను తయారు చేసుకుంటే వ్యవసాయంలో దాదాపుగా శ్రమతో పాటు పెట్టుబడులను తగ్గించుకోవచ్చు.
రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీయార్ వీళ్లలో టాప్ హీరో అతనేనా..?