మార్కెట్లోకి కొత్త బిజినెస్‌ వచ్చేసింది... గాలిని అమ్ముతూ దండిగా డబ్బు సంపాదిస్తున్నాడు!

ఇలాంటి రోజొకటి వస్తుందని చాలా కొద్ది మంది ఊహించి వుంటారు.అవును.

గాలిని అమ్మి భవిష్యత్తులో డబ్బులు గడిస్తారని కొంతమంది చెప్పారు.అయితే అది నేడు అనేక చోట్ల నిజమైంది కూడా.

అయితే మీలో అనేకమందికి గాలి అమ్మి డబ్బులు సంపాదించడం ఏంటి? అనే సందేహం వచ్చింది కదూ.

మన చుట్టూ ఎక్కడపడితే అక్కడ, ఎంత కావాలంటే అంత గాలి వున్నప్పుడు, పైగా ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకోవడం అంటే వింతేగా మరి.

నాకూ మీకూ రాని అదిరిపోయే ఐడియా ఓ యువకుడికి వచ్చింది.అవును.

దాంతో సింపుల్ గా గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్నాడా యువకుడు.కాలుష్యం కారణంగా స్వచ్ఛమైన గాలి లభించడం ఈ రోజుల్లో గగనమైపోయింది.

సరిగ్గా.ఈ పాయింట్ ను క్యాష్ చేసుకుంటున్నాడు కొలంబియాకు చెందిన ఓ యువకుడు.

అతగాడూ ఎవరూ ఊహించని కొత్త రకం బిజినెస్ కి తెర లేపాడు.కంటికి కనిపించని గాలిని బాటిళ్లలో నింపి అమ్మేస్తున్నాడు.

ఫ్రీగా దొరికే గాలిని అమ్మి డబ్బులు పోగేసుకుంటున్నాడు.గాలితో డబ్బులు పోగేయడం ఎలాగో తెలుసుకున్న ఔత్సాహిక బిజినెస్‌ మ్యాన్‌ గా పేరొందిన ఆ యువకుడే కొలంబియాలోని మెడెలిన్‌ కు చెందిన జూవాన్‌ కార్లోస్‌ అల్వరాడో.

కొలంబియాలోని మెడలిన్‌ ప్రాంతం అద్భుతమైన వాతావరణానికి పేరు.దీనిని క్యాష్ చేసుకోవడంపై దృష్టి పెట్టాడు జూవాన్‌ కార్లోస్‌ అల్వరాడో.

ఇక్కడి సహజమైన, నాణ్యమైన గాలిని ఆస్వాదించండి అంటూ గాలి నింపిన బాటిళ్లను టూరిస్టులకు అమ్ముడుతున్నాడు.

‘మెడలిన్‌ ఎయిర్‌’ అని బ్రాండ్‌ నేమ్‌ తో తన గాలి బాటిల్స్ ను విక్రయిస్తున్నాడు.

బాటిళ్లలో గాలి ఏంటి? అంటూ అనేకమంది విమర్శించినా వాటన్నిటీ గాలికే వదిలేసి తన బిజినెస్‌ కంటిన్యూ చేస్తున్నాడు జూవాన్.

అసలు బాటిళ్లలో గాలిని నింపడం ఎంతో కష్టమని, అందుకోసం తాను ఒక ప్రత్యేక పరికరాన్ని తయారు చేశానని జూవాన్ చెప్పుకొచ్చాడు.

ఒక్కో బాటిల్‌ లో గాలిని శుద్ధి చేసి నింపడానికి పావు గంట నుంచి అరగంట దాకా సమయం పడుతుందన్నాడు.