అమెరికాలో ఉన్నానన్న అనసూయ.. ఐఫోన్ 14 తీసుకొస్తావా అంటూ నెటిజన్ ప్రశ్న.. ఆ తర్వాత?
TeluguStop.com
అనసూయ గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.
ఆ రేంజ్ లో ఆమె పాపులర్ అయిపోయింది.జబర్దస్త్ షోతో మొదలైన ఆమె కెరీర్ ఇప్పుడు బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా పీక్స్ లో ఉందనే చెప్పుకోవాలి.
ఓ వైపు యాంకర్ గా అలరిస్తునే మరోవైపు సినిమాల్లో బిజీబిజీగా గడుపుతోంది ఈ స్టన్నింగ్ బ్యూటీ.
సోషల్ మీడియా లో హీరోయిన్ లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.తన గ్లామర్ తో కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అను.
కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ గా ట్రై చేసిన పెద్దగా అవకాశలు రాకపోవడంతో ఫ్యామిలీ కోసం ప్రైవేట్ జాబ్స్ చేసింది.
కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది.అనసూయకు అయితే మొదటి నుంచి ఆమె ముక్కు సూటిగానే మాట్లాడుతుంది.
అదే ఆమెను కొన్ని సార్లు వివాదాల్లో పడేపస్తోంది.మొన్న లైగర్ సినిమా సమయంలో కూడా ఆమె మీద ఏ రేంజ్ లో విమర్శలు, ట్రోల్స్ వచ్చాయో మనం చూశాం.
కానీ ఆమె మాత్రం అవేమీ పట్టించుకోకుండా తన దారి తాను చూసుకుంటుంది.ఆమె కెరీర్ పరంగా ఎంతో సక్సెస్ అయింది.
దాన్ని ఎవరూ కాదనలేరు.జబర్దస్త్ నుంచి కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె.
ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగింది.దీనికి కారణం ఆమె పుష్ప సినిమా అనే చెప్పుకోవాలి.
ఈ సినిమా తర్వాత నుంచే ఆమెకు బోలెడన్ని అవకాశాలు రావడం స్టార్ట్ అయింది.
ఇప్పుడు వరుసగా సినిమాల్లో బిజీ అయిపోవడంతోనే బుల్లితెరకు బ్రేక్ ఇచ్చేసింది. """/" /
అయితే ఆర్య-2 సినిమాలో శ్రద్ధ దాస్ క్యారెక్టర్లు ముందుగా దర్శకుడు సుకుమార్ అనసూయకు చెప్పగా ఫ్యామిలీ కోసం అప్పట్లో ఈ ఆఫర్ ను వద్దనుకుందని తెలిసింది.
ఆ తరువాత భర్త ప్రోత్సాహంతో మల్లెమాల ప్రొడక్షన్స్ లో వచ్చిన బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ప్రోగ్రామ్ కు యాంకర్ గా ఎంపికైంది ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ షోలో డ్రెస్సింగ్ స్టైల్, పొట్టి బట్టల్లో తన అందచందాలను వడ్డించడంతో అనసూయ పేరు ఒక్కసారిగా మారుమోగింది.
దర్శకుడు సుకుమార్ చూపులు అనసూయ అంద చందాల పై పడటంతో ఆయన సినిమాల్లో వరుసగా ఆఫర్లు ఇస్తూ వస్తున్నారు గతంలో రాంచరణ్ నటించిన రంగస్థలం సినిమాలో అనసూయ రంగమ్మత్త క్యారెక్టర్ పోషించి మరింత గుర్తింపును తెచ్చుకుంది.
కేవలం సపోర్టింగ్ పాత్రలు మాత్రమే కాకుండా బలమైన నెగిటివ్ పాత్రలు కూడా చేసింది.
అంతేకాకుండా కొన్ని స్పెషల్ సాంగ్స్ తో కూడా అనసూయ భరద్వాజ్ ఎంతగానో ఆకట్టుకుంది.
"""/" /
ఆమె ఎప్పటికప్పుడు తన ఫొటోలను వీడియోలను దాంతోపాటు ఇంస్టాగ్రామ్ రీల్స్ కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది.
ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.ఇకపోతే అనసూయ అమెరికాలో ఉన్న ఒక వీడియో రీల్ లో షేర్ చేసింది.
అప్పుడు ఆమె ఫ్యాన్ అయినా ఒక నెటిజను కామెంట్ల రూపంలో నా కోసం అమెరికా నుంచి ఐఫోన్ 14 ప్రోఎక్స్ ఫోన్ ను తీసుకొస్తావా అని ప్రశ్నించాడు.
మరి ఆ కామెంట్ కి అనసూయ ఇంతవరకు రియాక్ట్ అయితే కాలేదు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024