మనోజ్ పెళ్లి గురించి ప్రశ్నించిన నేటిజన్… దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన లక్ష్మీ ప్రసన్న!
TeluguStop.com
మంచు మనోజ్ గత కొంతకాలంగా తన వ్యక్తిగత కారణాల వల్ల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.
ఈమె ప్రముఖ రాజకీయ నాయకుడు దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనికతో రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈ వార్తలకు అనుగుణంగా మంచు మనోజ్ స్పందిస్తూ త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని, నా జీవితంలో ఈ విషయం చాలా ముఖ్యమైనది అంటూ చెప్పుకొచ్చారు.
అయితే ఈయన తప్పనిసరిగా తన రెండో పెళ్లి గురించి చెబుతారని అందరూ భావించగా మనోజ్ మాత్రం తన సినిమా గురించి ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.
"""/"/
ఈయన వాట్ ద ఫిష్ అనే మూవీని ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.
అయితే ఈయన పెళ్లి గురించి చెప్పకుండా సినిమా గురించి చెప్పడంతో కొందరు నిరుత్సాహానికి గురైన మరి కొందరు మాత్రం త్వరలోనే మనోజ్ తన రెండో పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మీ ప్రసన్న తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇలా స్వామివారి దర్శనం అనంతరం ఈమె శ్రీకాళహస్తిలో సందడి చేశారు.ఈ క్రమంలోనే ఒక అభిమాని ఏకంగా మంచు లక్ష్మిని మనోజ్ రెండో పెళ్లి గురించి ప్రశ్నించారు.
"""/"/
మంచు మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అంటూ ప్రశ్నించడంతో మంచు లక్ష్మి ఈ ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం చెప్పింది.
ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.నేను కుటుంబంతో ఇలా గుడికి వచ్చినప్పుడు మీరు పర్సనల్ విషయాలు అడగడం ఎంతవరకు కరెక్ట్? మనోజ్ పెళ్లి గురించి నన్ను అడిగే బదులు తనని అడగండి నా సినిమాల గురించి అడిగితే నేను చెబుతాను.
ప్రస్తుతం నేను నటించిన అగ్ని నక్షత్రం సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
ఇలా నా పరిధిలో ఉన్న విషయాలు గురించి అడిగితే నేను చెబుతాను కానీ, నా పరిధిలో లేనివి అడిగితే నేను చెప్పలేను అంటూ ఈమె సమాధానం చెప్పారు.
ఈ విధంగా మంచు లక్ష్మి మనోజ్ పెళ్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మోక్షజ్ఞ.. వైరల్ వార్త నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండగే!