బేస్ బాల్ జాతీయ జట్టుకు ఎంపికైన నల్లగొండ జిల్లా వాసి

నల్లగొండ జిల్లా:మిర్యాలగూడ మండలం పచ్చారిగడ్డ గ్రామానికి చెందిన కలకుంటి శివ జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు బేస్ బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అమరావతి సైదులు,చిర్ర మల్లేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 9వ తేదీ కరీంనగర్ జిల్లాలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి జూనియర్స్ పోటీలో పాల్గోని అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పేర్కొన్నారు.

ఈ నెల 22 నుంచి 26 వరకు పంజాబ్ లోని సంగూర్ లో జాతీయ స్థాయి జూనియర్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించబోతున్నట్లు చెప్పారు.

జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కిన శివను పలువురు అభినందించారు.

వైయస్ జగన్ భద్రతపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!