అనాధలుగా బస్ షెల్టర్ లో తలదాచకుంటున్న తల్లి కొడుకు

డే కేర్ సెంటర్ కు తరలించిన ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ, గంభీరావుపేట ఎస్.

ఐ మహేష్రా జన్న సిరిసిల్ల జిల్లా :వారు పుట్టి పెరిగిన గ్రామం లో ఉన్న ఆస్తిని కొంత మంది వ్యక్తులు వారు స్థానికంగా లేకపోవడంతో కబ్జా చేశారు.

స్థానికంగా లేకపోవడంతో వారి పేరిట ఉన్న భూమిని దౌర్జన్యంగా ఖబ్జా చేశారు.భర్త చనిపోవడంతో తనకు ఉన్న నలుగురు అడ బిడ్డలు ఉండగా కొద్ది రోజుల పాటు చూసిన బిడ్డలు తల్లికి వృద్ధాప్యం దరిచేరడంతో బిడ్డలు చీ కొట్టారు.

ఒక్కగానొక్క కొడుకు బతుకుదెరువు కోసం వృత్రి రీత్యా పురోహితుని గా వివిధ శక్తి పీఠం లలో పనిచేశారు.

తన తల్లి ని తన తోడ బుట్టిన అక్కలు నలుగురు వెళ్లకొట్టిన విషయం తెలుసుకున్న కొడుకు తన భార్య పిల్లలను వదిలి తల్లి వద్దకు చేరుకుని స్వగ్రామం కొత్తపల్లి కి చేరుకున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట( Gambhiraopet ) మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వేదాంతం పద్మావతి (99)సంవత్సరాలు.

ఈమెకు ఒక కుమారుడు గోపాలచారి, నలుగురు కూతుళ్ళు ఉన్నారు.కుమారుడు పురోహితుడు కాగ శక్తి పీఠంలలో పని చేస్తూ కుటుంభాన్ని పోషించుకున్నాడు.

తన తల్లి పద్మావతి( Padmavati ) నీ తన అక్కలు సరిగా చూడడం లేదనీ తెలుసుకుని తల్లి ఉన్న చేగుంట కు చేరుకుని స్వగ్రామం కొత్తపల్లి వచ్చారు.

వారు ఉన్న ఇల్లు కూలిపోవడంతో నిలువనీడ లేకపోవడంతో ఎక్కడ ఉండాలో వారికి అర్థంగాక కొత్తపల్లి ఎల్లమ్మ గుడి వద్ద అదే విధంగా అక్కడి బస్ షెల్టర్( Bus Shelter ) లో నెలరోజులపాటు వచ్చి పోయే వారి వద్ద డబ్బులు అడుక్కుని తన తల్లికి హోటల్ కు వెళ్లి గోపాలచారి భోజనం తెచ్చి ఇరువురు తినేవారు.

ఇట్టి సంఘటనను అదే గ్రామానికి చెందిన పోస్ట్ మ్యాన్ రాజనర్స్ సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా వారి విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్( Balaraju Yadav ) ఎల్లారెడ్డి పేట లో గల డే కేర్ సెంటర్ నిర్వాహకురాలు మమత తో చర్చించి చేర్చుకోవాలని కోరారు.

ఇట్టి విషయం గంభీరావుపెట ఎస్.ఐ మహేష్ కు బాలరాజు యాదవ్ తెలపగా ఇరువురు కలిసి శనివారం ఉదయం కొత్తపల్లి కి పోలీస్ పెట్రోలింగ్ వాహనములో తల్లి కొడుకులను తీసుకుని రాగ ఇట్టి విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి డే కేర్ సెంటర్ కు చేరుకున్నారు.

తల్లి కొడుకులను పరామర్శించి వారి కుటుంబ వివరాలు వారిని అడిగి తెలుసుకున్నారు.మానవత్వ దృక్పథంతో స్పందించిన ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ ను గంభీరావుపేట ఎస్.

ఐ మహేష్ ను ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి అభినందించారు.సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంట ఎల్లారెడ్డి పేట ఎస్.

ఐ రమాకాంత్ ఉన్నారు.

పాస్‌పోర్ట్‌లో థాయ్‌లాండ్‌ ట్రిప్ వివరాలు చెరిపేసిన యువతి.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్..?