యువతిపై దాడి చేసిన కొండముచ్చు.. భయానక వీడియో వైరల్..

ఈరోజుల్లో ఒక మూగ జీవులు మనుషులపై ఎటాక్ చేయడం చాలా కామన్ అయిపోయింది.

కుక్కలు, ఆవులు, కోతులు ఇలా చెప్పుకోండి పోతే మనుషులతో నివసించేవే ఈ దాడులకు పాల్పడుతున్నాయి.

తాజాగా ఇలాంటి మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.ఒక అపార్ట్‌మెంట్ బిల్డింగ్ పార్కింగ్ లాట్‌లో వెళ్తున్న ఒక అమ్మాయిపై కోతి ( Monkey )దాడి చేసింది.

ఈ దాడిలో ఆమెకు గాయాలైనట్టు తెలుస్తోంది.అందుకే తీవ్ర నొప్పితో అరిచింది.

నిజానికి ఇది ఒక కొండముచ్చు. """/" / ఈ భయంకరమైన దృశ్యం సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అమ్మాయి అపార్ట్‌మెంట్ టవర్ నుంచి బయటకు వస్తున్నట్లు కనిపిస్తుంది.

అప్పుడు, సడన్‌గా ఒక కొండముచ్చు వెనుక నుంచి వచ్చి ఆమె కాలును కొట్టింది.

అమ్మాయి నొప్పితో అరిచింది తర్వాత తనను తాను విముక్తి చేసుకోవడానికి ప్రయత్నించడంతో కోతి వెంటనే ఆ ప్రదేశం నుంచి పారిపోయింది.

ఈ ఘటన జులై 11న జరిగింది, అయితే కచ్చితమైన ప్రదేశం తెలియదు.ఈ సంఘటనకు సంబంధించిన వీడియోకు రెండు లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.

"""/" / ఈ వీడియో ఎక్స్‌ ప్లాట్‌ఫాంలో పోస్ట్ అయ్యింది.దాని క్యాప్షన్‌లో "ఇది చాలా భయంకరంగా ఉంది.

కొండముచ్చు బేస్‌మెంట్ ఏరియాలో అమ్మాయిపై దాడి చేసింది." అని రాసి ఉంది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు వెంటనే తమ రియాక్షన్లు తెలియజేశారు.కొంతమంది అమ్మాయి ఆరోగ్యం బాగుందా అని ఆందోళన వ్యక్తం చేయగా, మరికొంతమంది తమ అనుభవాలను పంచుకున్నారు.

"ఇది చాలా సీరియస్ విషయం, కోతి అడవి జంతువులా దాడి చేసింది." అని మరొక వ్యక్తి అభిప్రాయపడ్డారు.

"ఇది కేవలం భయంకరమైన సంఘటన మాత్రమే కాదు.జంతువులు ఇప్పుడు మనుష్యులపై దాడి చేస్తున్నాయి.

కొన్ని వారాల క్రితం, ముసలి, బలహీనంగా ఉన్న ఒక పెంపుడు కుక్క కౄరంగా మారి పొరుగువారిని కరిచింది.

వాతావరణ మార్పు కారణంగా ఏదో ఘోరమైన విషయం జరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా సముద్ర జీవులు కూడా ఇలాంటి లక్షణాలను చూపుతున్నాయి" అని ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

డెలివరీ తర్వాత ఈ న్యాచురల్ స్ప్రే వాడితే హెయిర్ ఫాల్ కు సులభంగా చెక్ పెట్టవచ్చు!