హైదరాబాద్ లో పోస్టర్ల కలకలం
TeluguStop.com
హైదరాబాద్ నగరంలో పోస్టర్ల కలకలం చెలరేగింది.కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెలిసిన ఈ పోస్టర్లలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారని తెలుస్తోంది.
హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ వేదికగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాలు జరుగుతుండగా ఇవాళ సాయంత్రం తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే పలువురు ముఖ్యనేతలు సీడబ్ల్యూసీ మీటింగ్స్ కు హాజరయ్యారు.ఈ సమయంలో వెలసిన వాల్ పోస్టర్లు తీవ్ర కలకలం సృష్టించాయి.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పథకాలు, తెలంగాణ పథకాలను పోల్చుతూ పోస్టర్లు దర్శనమిస్తున్నాయి.అయితే కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా దర్శనమిస్తున్న పోస్టర్లపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.