ఓ వ్యక్తి పొట్టలో బయటపడ్డ గని… 187 కాయిన్స్ ఎలా పోయాయో?

బేసిగ్గా చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు చాలా చిలిపి పనులు చేస్తూ వుంటారు.వారికి పెద్దగా జ్ఞానం ఉండదు కనుక అలా ఆడుకునేటప్పుడు దొరికినివి దిరికినట్టు తినేస్తూ వుంటారు.

అనేక సందర్భాలలో నాణేలు వంటివి మింగేస్తుంటారు.అందుకే వారు ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా మసలుకోవాలి.

ఎందుకంటే వారికి ఏది మంచి ఏది చేదు అనే విషయాలపై అవగాహన ఉండదు కనుక.

అయితే పెద్దవాళ్ళు అలా ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది? దారుణంగా అనిపిస్తుంది.ఇక్కడ కూడా అలాంటి సంఘటనే జరిగింది.

కర్ణాటకలోని ఒక ఊహించని సంఘటన జరిగింది.బాగల్ కోట్ ప్రాంతంలో ఉన్న HSK ఆస్పత్రిలో 58 ఏళ్ల వ్యక్తి కడుపు నొప్పితో బాధపడుతూ అడ్మిట్ అయ్యాడు.

దాంతో అతనిని పరీక్షించిన వైద్యులు ఎండోస్కోపీ నిర్వహించారు.అప్పుడు స్కానింగ్ రిపోర్టులో ఒక షాకింగ్ విషయం బయటపడింది.

ఆ వ్యక్తి కడుపులో నాణేలు ఉన్నట్లు గుర్తించారు.వెంటనే సర్జరీ చేయగా 5 రూపాయల 56 నాణేలు, 2 రూపాయల 51 నాణేలు, 1 రూపాయి 80 నాణేలు సహా మొత్తం 187 నాణేలు దొరికాయి.

దాంతో వైద్యులు సైతం విస్తుపోయారు. """/"/ కాగా ఈ సర్జరీని వైద్యులు డా.

ఈశ్వర్ కలబురగి బృందం విజయవంతంగా నిర్వహించింది.అయితే కడుపులో ఇన్ని నాణేలు ఎందుకు బయటపడ్డాయో ఇంకా తెలియాల్సి వుంది.

అతను ఇన్ని నాణేలను ఎందుకు మింగాడు అనేది ఓ మిస్టరీగా మారింది.కడుపులో నుంచి మొత్తం 187 నాణేలను సురక్షితంగా తొలగించిన వైద్యుల బృందం ప్రశంసలు అందుకుంది.

విదేశాల్లో ఇలాంటి ఆశ్చర్యకరమైన ఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి.ఇప్పుడు బాగల్‌కోట్‌లోనే ఇలా జరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది అని స్థానికులు అంటున్నారు.