చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన వైద్య బృందం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేడు హిమాన్షి పిల్లల హాస్పిటల్, కామాక్షి హాస్పిటల్ వైద్య బృందం వారి ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇట్టి చలివేంద్రం సిరిసిల్ల పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా పురపాలక సంఘ అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ ఎండలు అధికంగా ఉన్న కారణంగా బాటసారుల దాహాన్ని తీర్చాలనే సేవా భావంతో కూడిన మంచి ఉద్దేశంతో ఈ చలివేంద్రాలను కామాక్షి, హిమాన్షి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినందుకు హాస్పిటల్ యాజమాన్యం వారిని ఇలాంటి సామాజిక కార్యక్రమాలలో ఎప్పుడూ ముందుండే డా.

సురేంద్ర బాబు ని అభినందించారు.ఎండలు అధికంగా ఉన్న కారణంగా ప్రజలు వడదెబ్బకు గురికాకుండ జాగ్రత్తగా ఉండాలని ప్రజలు అనవసరంగా మధ్యాహ్నం పూట బయట తిరగకూడదని ఒకవేళ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే త్రాగు నీరు, గొడుగు లేదా టోపీ, చేతిరుమాలును వెంట ఉంచుకోవాలని కొన్ని సందర్భాలలో వడదెబ్బ వల్ల ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎవరు ఎండల పట్ల నిర్లక్ష్యంగా ఉండరాదని అన్నారు.

అనంతరం డాక్టర్ సురేంద్రబాబు మాట్లాడుతూ.ఎండాకాలం ఎండల తీవ్రత వల్ల వడగాలుల వల్ల డిహైడ్రేషన్కు గురికావడం జరుగుతుందన్నారు.

కాబట్టి సాధ్యమైనంత వరకు మంచినీళ్లు తాగుతూ , నీడ ప్రదేశాలలోనే ఉండేలా చూసుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎండల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని అంటూ తగు జాగ్రత్తలను తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు వొజ్జల అగ్గి రాములు, డాక్టర్ సురేంద్ర బాబు, కామాక్షి, హిమాన్షి హాస్పిటల్ వైద్యులు సిబ్బంది, బాటసారులు పాల్గొన్నారు.

అల్లు అర్జున్ జాతకం పై వేణు స్వామి కామెంట్స్… అసలు సినిమా ముందుంది అంటూ?