రేవంత్ వెనుక ఓ మీడియా అధిపతి ? కేసీఆర్ పై కోపంతోనే ..?

తెలంగాణలో ఆకస్మాత్తుగా రేవంత్ రెడ్డి ప్రాధాన్యం, ఫోకస్ పెరిగిపోయింది.గతంలో ఎప్పుడూ లేనంతగా కాంగ్రెస్ లో ఏ పార్టీకి ఇవ్వనంత స్థాయిలో మీడియా ఫోకస్ ఇస్తోంది.

రేవంత్ ఎక్కడికి ప్రచారానికి వెళ్లినా,  ఏ పొలిటికల్ కామెంట్స్ చేసినా మీడియాలో బాగా హైలెట్ అవుతున్నాయి.

రేవంత్ కు పాజిటివ్ యాంగిల్ లో మీడియా కథనాలు వెలువడుతున్నాయి.అయితే అకస్మాత్తుగా మీడియా రేవంత్ ను హైలెట్ చేయడం వెనుక కారణాలు ఏమిటనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.

తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడిగా గతంలో పనిచేసిన ఉత్తమ్కుమార్ రెడ్డి కి ఈ స్థాయిలో ఎప్పుడూ మీడియాలో ఫోకస్ లభించలేదు.

కానీ రేవంత్ కు మాత్రమే ఎందుకు అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయాన్ని లోతుగా పరిశీలిస్తే అనేక ఆసక్తికర అంశాలు బయటకు వస్తున్నాయి.

ఏపీలో టీడీపీ ముద్ర వేయించుకున్న ఆ మీడియా ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వానికి,  జగన్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తారని,  కేవలం టిడిపిని చంద్రబాబును హైలెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు ఉన్నాయి.

ఇప్పుడు అదే మీడియా అధిపతి రేవంత్ కోసం పనిచేస్తున్నారని, ఆయనకు అవసరమైన స్క్రిప్ట్ తో పాటు మీడియాలో ఫోకస్ అయ్యేవిధంగా సలహాలు సూచనలు ఇస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రేవంత్ ద్వారా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పై ఉన్న కక్ష తీర్చుకునేందుకు ఆయన ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది.

"""/"/  ఆయన సూచన ప్రకారమే రేవంత్ ప్రత్యేకంగా సోషల్ మీడియా టీం ఏర్పాటు చేసుకుని తెలంగాణ కాంగ్రెస్ తో పాటు,  వ్యక్తిగత ఇమేజ్ పెరిగే విధంగా చేసుకుంటున్నారట.

2023 ఎన్నికల నాటికి టిఆర్ఎస్ ను అధికారానికి దూరం చేయడమే లక్ష్యంగా రేవంత్ ను ప్రమోట్ చేసే బాధ్యతను ఆ మీడియా అధిపతి తీసుకున్నట్లుగా తెలంగాణ రాజకీయ వర్గాల మధ్య నడుస్తున్న చర్చ.

ఏపీలో సమస్యత్మక నియోజకవర్గాలు ఇవేనా ? ఎన్నికల కమిషన్ ఏం చేయబోతోంది ?