Peter Van Tangen Buskov : ముక్కు రంధ్రాలలో 68 అగ్గిపుల్లలను దూర్చుకున్న వ్యక్తి.. గిన్నిస్ రికార్డు క్రియేట్..!

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ( Guinness World Records )క్రియేట్ చేయడం అంత ఈజీ ఏం కాదు.

ఈ రికార్డులను లక్షల్లో ఒకరు మాత్రమే సాధించగలుగుతారు.వీటిని సాధించడానికి చాలామంది ఎంత మంచి జీవితాన్ని అంకితం చేస్తుంటారు.

అయితే ఈ రికార్డులలో కొన్ని చాలా విచిత్రమైనవి, అసాధారణమైనవి కూడా ఉంటాయి.తాజాగా డెన్మార్క్‌కు( Denmark ) చెందిన ఓ వ్యక్తి అలాంటి అసాధారణమైన పనితో గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.

ఆ వ్యక్తి పేరు పీటర్ వాన్ టాంగెన్ బుస్కోవ్( Peter Van Tangen Buskov ), అతను తన ముక్కులో ఏకంగా 68 అగ్గిపుల్లలను పెట్టుకోగలిగాడు.

"""/" / సాధారణంగా ఒక ముక్కు రంధ్రంలో 10-15 అగ్గిపుల్లలను పెట్టుకోవడమే చాలా కష్టం.

అప్పటికే అది బాగా టైట్ అయి నొప్పి పుడుతుంది.కానీ ఈ వ్యక్తి మాత్రం రెండు ముక్కు రంధ్రాలలో దాదాపు 70 అగ్గిపుల్లలను జొప్పించి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు.

ఈ ఫీట్‌ చేసిన మొదటి వ్యక్తిగా అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

ఈ బిరుదు పొందడానికి, అతను కనీసం 45 అగ్గిపుల్లలను ముక్కులో పెట్టుకోవాలి.కానీ అంతకుమించి అగ్గిపుల్లలను ముక్కులో ఉంచుకుని వావ్‌ అనిపించాడు.

"""/" / ఏదైన సరదాగా, డిఫరెంట్‌గా చేయాలనే ఆలోచనతో ఈ ఫీట్ చేశానని పీటర్ చెప్పాడు.

అతనికి చిన్నప్పుడు ఈ ఆలోచన లేదు.అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పుస్తకాన్ని చిన్నతనం నుంచి బాగా చదువుతూ ఉండేవాడు.

ఆ పుస్తకంలో తన పేరును కూడా చూసుకోవాలని బాగా కోరుకుంటుండేవాడు.అందుకోసం ఏదైనా వెరైటీగా చేయాలని భావించేవాడు.

అలా ఆలోచిస్తూ చివరికి అగ్గిపుల్లలు ముక్కులో పెట్టుకోవాలని అనుకున్నాడు.మొదటగా కొన్ని పుల్లలను పెట్టుకోవడం ప్రారంభించగా అతడికి దానివల్ల పెద్దగా నొప్పి కలగలేదు.

అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ముక్కు రంధ్రాలు సాగుతూ పెద్దగా అయ్యాయని చెప్పాడు.

ఇంకా ఎక్కువ పుల్లలతో తన రికార్డును తానే బ్రేక్ చేయాలనుకుంటున్నట్లు కూడా చెప్పాడు దీనికి ట్రైనింగ్ అవసరమని పేర్కొన్నాడు.

అయితే అతని రికార్డు అందరికీ నచ్చలేదు.ఇంటర్నెట్‌లో కొంతమంది ఇది సిల్లీగా ఉందని, తమను ఆకట్టుకోలేదని అన్నారు.

ఆమె సైన్ చేసినప్పుడే గేమ్ ఛేంజర్ డిజాస్టర్.. కమల్ ఆర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!