త‌న భార్య‌కు పుట్టిన బిడ్డకు తాను తండ్రి కాద‌న్న వ్య‌క్తి.. ట్విస్టు మామూలుగా లేదు..

ఈ మ‌ధ్య కోర్టుల్లో చాలా చిత్ర విచిత్ర‌మైన ఘ‌ట‌న‌లు జ‌రుగుతున్నాయి.మరీ ముఖ్యంగా పెండ్లి చేసుకున్న భార్యా భ‌ర్త సంబంధాల విష‌యంలోనే ఇలాంటివి ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయి.

ఇక‌పోతే ఇప్పుడు కూడా ఇలాంటి ఘ‌ట‌నే చోటుచేసుకుంది.అదేంటంటే తన భార్యకు రీసెంట్ గా పుట్టిన బిడ్డకు తాను తండ్రిని కాద‌ని, అస‌లు త‌న‌కు పిల్ల‌లే పుట్ట‌ర‌ని ఓ వ్య‌క్తి ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు.

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసు ఉదంతం మ‌న ప‌క్క‌నే ఉండే కేరళలో జ‌రిగింది.

త‌న‌కు స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉంటుంద‌ని, డాక్ట‌ర్లే త‌న‌కు పిల్లలు పుట్ట‌ర‌ని చెప్పార‌ని ఓ వ్య‌క్తి వాదించాడు.

మ‌రి త‌న‌కు పిల్ల‌లు పుట్టే అవ‌కాశం లేన‌ప్పుడు ఆ బిడ్డ ఎలా పుట్టిందంటూ ఆయ‌న కోర్టు మెట్లు ఎక్కారు.

కేర‌ళ రాజ‌ధాని తిరువనంతపురం ప‌ట్ట‌ణంలో నివాసం ఉండే ఓ వ్యక్తికి 2006 సంవ‌త్స‌రంలో పెళ్లైంది.

కాగా ఇలా పెళ్లి అయిన 22 రోజుల‌కే ఆయ‌న ఉద్యోగ‌రీత్యా లద్ధాఖ్ కు వెళ్ల‌డంతో అత‌ను భార్య‌తో వైవాహిక సంబంధాన్ని పెట్టుకోలేదు.

ఇక‌పోతే పెండ్లి అయిన 22రోజుల‌కు కూడా ఆయ‌నకు త‌న భార్య‌తో ఎలాంటి వైవాహిక సంబంధం లేదు.

కానీ అనూహ్యంగా ఆయ‌న భార్య 2007 మే నెల‌ల‌లో ఓ బిడ్డకు జన్మనివ్వ‌డంతో ఆయ‌న‌కు షాక్ ఎదురైంది.

"""/"/ ఇంకేముంది ఆ వ్య‌క్తి త‌న ప్ర‌మేయం లేకుండానే త‌న భార్య బిడ్డకు జ‌న్మ‌నిచ్చింద‌ని, కాబ‌ట్టి త‌న‌కు విడాకులు ఇవ్వాలంటూ కోర్టు మెట్లు ఎక్కాడు.

ఇక త‌న భార్యకు ఆమె అక్క భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇలా బిడ్డ‌ను క‌న్న‌ద‌ని, కాబ‌ట్టి త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరాడు.

ఇక త‌న భార్య అక్ర‌మ సంబంధం పెట్టుకుంద‌న్న ఆరోపణలతో కోర్టు ఆశ్రయించాడు ఆ వ్య‌క్తి.

కాగా ఇలా ఆరోప‌ణ‌ల కేసు న‌డుస్తున్న క్ర‌మంలోనే ఆమె ఓ మ‌గ బిడ్డకు జన్మనిచ్చి అత‌నికి మ‌రింత షాక్ క‌లిగించింది.

అయితే దీనిపై హైకోర్టు ఎలా తీర్పు ఇస్తుందో వేచి చూడాల్సిందే.

టాయిలెట్‌లో వింత శబ్దం.. తీరా చూస్తే 10 అడుగుల పెద్ద పాము?