తీవ్ర‌గాయాలతోనే బ‌రాత్ లో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన వ్య‌క్తి..

పెండ్లి అన‌గానే ఈ మ‌ధ్య ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తుకు వ‌చ్చేది బ‌రాత్ మాత్ర‌మే.

ఎందుకంటే ఈ న‌డుమ బ‌రాత్ ల‌కు సంబంధించిన వీడియోలే బాగా వైర‌ల్ అవుతున్నాయి.

సాధార‌ణంగా పెండ్లికి సంబంధించిన పెండ్లి కూతురు లేదంటే పెండ్లి కొడుకు వీడియోలు వైర‌ల్ కావాల్సింది పోయి బ‌రాత్ లో జ‌రిగే డ్యాన్స్ వీడియోలే బాగా పాపుల‌ర్ అయిపోతున్నాయి.

మొన్న‌టి దాకా వ‌ధూ, వ‌రులు డ్యాన్స్ చేసే వీడియోలు బాగా వైరల్ అయ్యేవి.

కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా పెండ్లికి వ‌చ్చిన పెద్ద‌లు డ్యాన్స్ చేస్తున్న వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

కాగా ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా పాపుల‌ర్ అవుతోంది.

అయితే ఇది కూడా పెండ్లి బ‌రాత్ కు సంబంధించిన వీడియోనే కావ‌డం గ‌మ‌నార్హం.

అయితే ఇది మీరు ఊహించ‌ని  దాని కంటే చాలా భిన్న‌మైన‌దండోయ్‌.ఎందుకంటే మీ ఊహ ప్ర‌కారం ఇక్క‌డ ఎవ‌రో ఒక‌రు డ్యాన్స్ చేసి ఉంటారు అనుకుంటున్నారు క‌దా.

కానీ అలా అయితే పొర‌పాటే.వ్య‌క్తి డ్యాన్స్ చేయ‌డం వ‌ర‌కు ఓకే అయినా అత‌ని ప‌రిస్థితి చూస్తే మాత్రం షాక్ అయిపోతారు.

ఎందుకంటే ఆస్ప‌త్రి బెడ్ మీద ఉండాల్సిన వ్య‌క్తి వ‌చ్చి పెండ్లిలో స్టెప్పులు ఇర‌గ‌దీస్తున్నాడు.

"""/" / ఇందుకు సంబంధించిన వీడియోపై దారుణ‌మైన సెటైర్లు పేలుతున్నాయి.ఈ వీడియోలో చూస్తే గ‌న‌క ఓ వ్య‌క్తి ఒంటినిండా గాయాల‌తో క‌ట్టు క‌ట్టించుకుని పైగా మెడ‌లో ఓ సెలైన్ బాటిల్ వేసుకుని డ్యాన్స్ చేయ‌డం ఇందులో క‌నిపిస్తుంది.

ఇంకో విష‌యం ఏంటంటే అత‌ని ఒంటినిండా ర‌క్త‌పు మ‌ర‌క‌లు కూడా క‌నిపిస్తున్నాయి.ఇలా ఒళ్లంతా క‌ట్లు క‌ట్టించుకుని ఎంతో ఎంజాయ్ చేస్తూ మ‌రీ స్టెప్పులు వేసేస్తున్నాడు.

ఇంకో విష‌యం ఏంటంటే అత‌ని డ్యాన్స్ చూస్తున్న వారంతా కూడా అత‌న్ని బాగా ఎంక‌రేజ్ చేస్తున్నారు.

దీనిపై నెటిజ‌న్లు ఓ రేంజ్లో ట్రోలింగ్ చేస్తున్నారు.

కుప్పం అభ్యర్థిగా రేపు చంద్రబాబు నామినేషన్