ఆ రాష్ట్రాల్లో కేసీఆర్ ఫ్లెక్సీల వెనుక ఇంత కథ ఉందా ?

ప్రస్తుతం దేశ రాజకీయాలపై దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్, బిజెపి కి వ్యతిరేకంగా మూడో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.

దీనిలో భాగంగానే వివిధ రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీల నేతలను,  ముఖ్యమంత్రులను కలుస్తూ బీజేపీ వ్యతిరేక కూటమి కి మద్దతుగా నిలబడాలని,  అలాగే రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అధికారం దక్కకుండా ఏం చేయాలనే విషయంపైన ప్రధానంగా చర్చిస్తున్నారు.

అయితే కేసీఆర్ ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలతో ఆయనకు స్వాగతం లభిస్తోంది.

ఆయా రాష్ట్రాల్లో కేసీఆర్ కు ఇంతమంది అభిమానులు ఉన్నారా ? జాతీయ స్థాయిలో కేసీఆర్ కు ఈ స్థాయిలో క్రేజ్ ఉందా అనే సందేహాలు అందరిలోనూ కలిగాయి.

   అయితే బిజెపి వంటి పార్టీ లకు సైతం కేసీఆర్ కు ఆయా రాష్ట్రాల్లో లభిస్తున్న ఆదరణ ఆందోళన కలిగిస్తోంది.

ఇది ఇలా ఉంటే మహారాష్ట్ర, జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్,  ఏపీ ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ కేసీఆర్ ఫ్లెక్సీలు ఏర్పాటు కావడంతో ఆయా రాష్ట్రాల్లోని కేసిఆర్ అభిమానులే ఇదంతా చేస్తున్నారని అంత ఇప్పటివరకు అనుకున్నా , దీని వెనుక ఉన్నది మాత్రం తెలంగాణకు చెందిన వ్యక్తిగానే తెలుస్తోంది.

టిఆర్ఎస్ కు చెందిన తెలంగాణ సాయి అనే వ్యక్తి కెసిఆర్ పై అభిమానంతో.

  ఆయన ప్రధాని అవ్వాలనే ఆకాంక్షతో ఈ విధంగా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారట.

విద్యార్థి దశ నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఇతడు పని చేయడం,  ఆ తర్వాత క్రమంలో టిఆర్ఎస్ లో చేరడం, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరమారం డివిజన్ టిఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా 2014 నుంచి ఇతడు కొనసాగుతూ వస్తున్నాడు.

టిఆర్ఎస్ లో ఇతర నామినేటెడ్ పదవులు ఏవీ ఇతనికి లేకపోయినా,  సొంత ఖర్చులతో ఆయా రాష్ట్రాల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ,  కేసీఆర్ పై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నాడట.

  """/"/ అందుకే ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గుజరాత్ లోని ఎయిర్ పోర్ట్,  రైల్వే స్టేషన్ చౌరస్తా జంక్షన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇంటి సమీపంలోని జంక్షన్ వద్ద, అలాగే ఏపీలో కేసిఆర్ పుట్టినరోజు సందర్భంగా భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం , ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి తో కేసీఆర్ భేటీ అయ్యేందుకు వెళ్లిన సమయంలో ఆయన భారీ ఫ్లెక్సీలను ముంబై లోని బాంద్రా కాలా నగర్ ,వెస్టర్న్ హైవే బ్రిడ్జి వద్ద భారీగా స్వాగత ఫ్లెక్సీ లను ఏర్పాటు చేశాడు .

అలాగే జార్ఖండ్ లోని రాంచీలో ఇదే విధంగా కేసీఆర్ భారీ ఫ్లెక్సీలను,  స్వాగత ద్వారాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ కెసిఆర్ పై ఉన్న అభిమానంతోనే చేస్తున్నాడట.

అయితే ఇప్పటివరకు కేసీఆర్ ఆయా రాష్ట్రాల్లో ప్రజలకు ఉన్న అభిమానం తో ఈ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి అని భావించినా ఇప్పుడు టిఆర్ఎస్ కు చెందిన వ్యక్తే అన్ని రాష్ట్రాల్లోనూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారనే విషయం బయటికి రావడం తో కేసీఆర్ ను జాతీయ స్థాయిలో ఫోకస్ చేసేందుకు ఈ విధంగా ఏర్పాట్లు చేసుకున్నారనే సెటైర్లు ఎన్నో వస్తున్నాయి.

.

వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబో లో వచ్చే సినిమా ఎలా ఉండబోతుంది..?