గొంతును రెండుగా చీల్చి వ్యక్తి దారుణ హత్య... దెయ్యం చంపిందంటున్న స్థానికులు..!

మహారాష్ట్ర రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఒక వ్యక్తి అత్యంత దారుణంగా గొంతు రెండు ముక్కలుగా చీలిపోయి హత్యకు గురయ్యాడు.

మహారాష్ట్ర రాష్ట్రంలోని నార్పే జిల్లా భివండి టౌన్ షిప్ లో ఈ ఘటన జరిగింది.

ఈ దారుణ హత్యకు కారణం మనిషి కాదని దెయ్యం అని స్థానికులు వ్యాఖ్యలు చేసున్నారు.

కొన్ని రోజుల క్రితం చనిపోయిన వ్యక్తి సోదరుడు అనారోగ్యంతో బాధ పడుతూ చనిపోయాడు.

అనారోగ్యానికి గురై చనిపోయిన వ్యక్తే ఆత్మ రూపంలో సోదరుడిని చంపేసి ఉంటాడని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాలలోకి వెళితే 31 ఏళ్ల తులసీరామ్ చవాన్ అనే వ్యక్తికి చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు.

అప్పటినుండి చవాన్ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నాడు.కొన్ని రోజుల క్రితం చవాన్ సోదరుడు అనారోగ్యానికి గురై చనిపోయాడు.

ఉన్న ఒక్క సోదరుడు చనిపోవడంతో చవాన్ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. """/"/ తన సోదరుడు చనిపోవడాన్ని తాను మరిచిపోలేకపోతున్నానని తన సోదరుడు తనతోనే ఉన్నట్లు ఉందని చవాన్ తన పక్కింట్లో ఉన్న మహిళకు చెప్పాడు.

ఆ మహిళ భయంగా ఉంటే తన ఇంట్లో పడుకోవాలని సూచించింది.అలాగే పడుకున్న చవాన్ ఉదయం 5 గంటలకు లేచి ఇంటినుండి వెళ్లిపోయాడు.

ఉదయం 7.30 గంటలకు చవాన్ శవమై కనిపించాడు.

గొంతు రెండుగా చీలిపోయి దారుణంగా హత్యకు గురి కావడంతో అతని సోదరుడే హత్య చేసి ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అనిల్ రావిపూడి కళ్యాణ్ రామ్ కాంబోలో పటాస్ 2 ఉంటుందా..?