జీతం ఎంతో చెప్పలేదని.. అల్లుడిని గదిలో బంధించిన అత్తమామలు!
TeluguStop.com
ఇది వరకు కోడళ్లను వేధించే కాలం ఉండేది.ప్రస్తుతం అల్లుల్లపై సాధింపులకు తెరతీసారు కొందరు అత్తామామలు.
తమకు కాబోయే అల్లుడు జీతం ఎంతో చెప్పలేదని ఏకంగా అతడిని బంధించేశారు.గదిలో పెట్టి తాళం వేశారు.
అంతేకాదు, జీతం ఎంతో చెబితేనే వదిలిపెడతామంటూ గోల చేశారు.ఓ వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వివరించాడు.
ఆ వివరాలు తెలుసుకుందాం.ఓ వ్యక్తి కొత్తగా ఉద్యోగంలో చేరాడు.
అప్పటికే అతడు ఒక అమ్మాయితో సహజీవనం చేస్తున్నాడు.త్వరలో ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఒకరోజు అతడికి కాబోయే అత్తమామలు పర్సనల్‌గా మాట్లాడాలి అని అల్లుడిని పిలిచారు.దీంతో అతడు అక్కడికి వెళ్లాడు.
అతడి ఫోన్, కార్ కీలు డైనింగ్ టేబుల్ మీద పెట్టి, గెస్టు రూమ్‌లో కూర్చోమన్నారు.
అతడు అలాగే చేశాడు.ఆ తర్వాత అతని ఉద్యోగం వివరాలు అడగడం మొదలుపెట్టారు.
చివరికి నీ జీతం ఎంత అన్నారు.దీనికి అతడు నిరాకరించాడు.
అది మీకు చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. """/" /
వారు పదేపదే వేధించిన చెప్పలేదు.
దీంతో అత్తమామలు కూడా తమ స్వరాన్ని పెంచారు.నా కూతురు భవిష్యత్తు భద్రంగా ఉంటుందా లేదా అనేది మాకు తెలియాలి.
అందుకే మాకు కచ్చితంగా ఈ విషయం తెలియాలి అన్నాడు అతడి మావయ్య.దానికి అల్లుడు సమాధానమిస్తూ.
మీ అమ్మాయిని చాలా బాగా చూసుకుంటా అన్నాడు.జీవితంలో డబ్బులు మాత్రమే కాదు.
ప్రేమ కూడా ముఖ్యమే అన్నాడు.అయితే, అల్లుడి మాటలతో అత్త ఏకీభవించలేదు.
జీవితంలో డబ్బు కూడా చాలా ముఖ్యం మర్యాదగా నీ జీతం ఎంతో చెప్పు అని అతడిపై ఒత్తిడి తెచ్చింది.
కానీ, అతడు మాత్రం ససేమిరా చెప్పలేదు.ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని, మీ కూతురిని బాగానే చూసుకుంటానని మాట ఇచ్చాడు.
"""/" /
ఆ తర్వాత ఆ గది నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు.
దీంతో తలుపువేసి అల్లుడిని బంధించారు.దీంతో అతడు గట్టిగా అరిచాడు.
అత్తకు ఒళ్లు మండింది.వెంటనే ఆ డోరు తీసి బయటకు వెళ్లిపోమనండి అని భర్తకు హుకుం జారీ చేసింది.
దీంతో అతడు ఆమె చెప్పినట్లే చేశాడు.డోరు తెరవగానే అల్లుడు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత అత్త.ఆమె కూతురికి ఫోన్ చేసింది.
ఏడుస్తూ.అల్లుడు తమతో అగౌరవంగా మాట్లాడాడని తెలిపింది.
దీంతో అత్తమామలకు క్షమాపణలు చెప్పాలని ఆమె అతడిపై ఒత్తిడి చేసింది.అతడు నిరాకరించాడు.
వారికి క్షమాపణలు చెప్పకపోవడం వల్ల మా రిలేషన్ షిప్ దెబ్బ తింటుందని నాకు తెలుసు.
కానీ, చేయని తప్పుకు క్షమాపణ ఎందుకు చెప్పాలి?’’ అని అతడు తెలిపాడు.
ఆ సెంటిమెంట్ ప్రకారం కాంతార మూవీ ప్రీక్వెల్ ఫ్లాప్ కానుందా.. అసలేం జరిగిందంటే?