గల్ఫ్ దేశాలలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలతో ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మోసాలకు పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) రుద్రంగి మండలం మనాల అడ్డబోర్ తండా గ్రామానికి చెందిన అజ్మీరా కిషన్ అనే వ్యక్తి తన ఇద్దరి స్నేహితులతో ఆర్మేనియం దేశంలో లక్షల్లో జీతాలతో ఉపాధి,ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, అమాయక ప్రజల వద్ద అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి గల్ఫ్ దేశాలకు పంపకుండా మోసాలకు పాల్పడుతున్నా అజ్మీరా కిషన్ ను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ బుధవారం రోజున ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అజ్మీరా కిషన్ అనే వ్యక్తి రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన కోల కృష్ణం రాజు అనే వ్యక్తి ని ఉపాధి నిమిత్తం అర్మేనియా అక్కడి నుండి రష్యా దేశానికి పంపిస్తా అని నెలకు లక్ష జీతం వస్తుంది అని మాయమాటలు చెప్పి అర్మేనియా దేశానికి పంపించడానికి 4,50,000/- రూపాయలు ఖర్చు అవుతుందని అవి కట్టిన నెల రోజుల లోపు అర్మేనియా దేశానికి పంపిస్తానని చెప్పగా, అదేవిధంగా పెగ్గెర్ల కి చెందిన తేలు రంజిత్ అనే వ్యక్తి వద్ద 7,50,00/-, మెట్పల్లి కి చెందిన గరిపెల్లి శశిధర్ వద్ద 6,50,000/- నరేష్ అంబారిపేట వద్ద 4,70,000/- ఆత్మకూరు కి చెందిన పుప్పాల సందీప్ వద్ద 7,50,000/- ముర్రిమాడు కి చెందిన అమరకొండా అనిల్ వద్ద 4,30,000/- మల్లేష్ వద్ద 4,50,000/- , మెట్పల్లి కి.
చెందిన గుంటుగా రాజేష్ వద్ద 2,50,000/- తీసుకొని వారికి విసిట్ విజాలు ఇచ్చి ఆర్మేనియం దేశం పంపి అక్కడ మూడు నెలలు ఉంచుకొని ఎలాంటి పని చూపించకుండా ,అక్కడ ఎలాంటి వసతులు కల్పించకుండా అజ్మీర కిషన్, సేపూరి తిరుపతి , కాల్వ ఉమా మహేష్ అను ముగ్గురు వ్యక్తులు మోసాలకు పాల్పడగా కోల కృష్ణం రాజు పిర్యాదు మేరకు రుద్రంగి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అజ్మీర కిషన్ ను అరెస్ట్ చేయడం జరిగిందని, మిగతా ఇద్దరిని త్వరలో పట్టుకోవడం జరుగుతుందని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల జిల్లాలో అజ్మీరా కిషన్, సేపూరి తిరుపతి , కాల్వ ఉమా మహేష్ చేతిలో మోసపోయిన బాధితులు 60 కి పైగా ఉన్నారని వారు మీ పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయాలని తెలిపారు.
ఉపాది నిమిత్తం గల్ఫ్ వెళ్ళేవారు నకిలీ ఏజెంట్ల( Fake Agents )కు డబ్బులు ఇచ్చి మోసపోవద్దని, ఇమ్మిగ్రేషన్, చట్టబద్ధత ఉన్నవారు నుంచి వీసాలు పొందాలన్నారు.
ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించి గల్ఫ్ మోసాలకు పాల్పడుతున్న వారు తమ వైఖరి మార్చుకోకపోతే కఠిన చర్యలు చేపడుతం అని ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు.
గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకొనుటకు జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ 8712656411 లేదా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వారిని సంప్రదించవచ్చని సూచించారు.
మతిమరుపే అతన్ని కోటీశ్వరుడిని చేసింది.. అదెలాగో తెలిస్తే..