ఆరువందల కోసం కక్కూర్తి పడితే రూ.25వేల జరిమానా, 10ఏళ్ల జైలు శిక్ష..!!

అత్యాశ అన్ని అనర్ధాలకు మూలం అంటారు.అతిగా ఆశపడ్దవారు ఏదో ఒక ఉచ్చులో చిక్కుకుని ఉన్నదంతా ఊడ్చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఇప్పుడు చదవబోయే విషయం కూడా ఇలాంటిదే.అదేంటో చూస్తే.

బాధితుడి అన్న తెలిపిన వివరాల ప్రకారం 2017, నవంబర్7న తన సోదరుడిపై దాడి చేసి అతని వద్ద నుంచి రూ.

600లు చోరీ చేశారని బాధితుడి అన్న ప్రతాప్ ఖోడ్డా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే 2 నెలల అయినా కూడా కేసులో ఎలాంటి పురోగతి లేదు.అందుకే అతడు 2018, ఫిబ్రవరి 3న మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాడు.

తన సోదరుడి పై జరిగిన దాడితో పాటు దొంగతనం గురించి వివరించారు.అప్పుడు గానీ కేసులో వేగం పెరిగింది.

"""/"/ ఇక ఈ కేసు పూర్వఫలాలను విచారించిన అధికారులు నిజనిజాలు గ్రహించి కోర్టుకు నివేదికను సమర్పించారట.

దీంతో 2021 ఫిబ్రవరి 9న ఈ కేసుకు సంబంధించిన తీర్పును కోర్టు వెల్లడించింది.

ఇద్దరు దోషులకు ఒక్కొక్కరికి రూ.25వేల చొప్పున జరిమానాతో పాటు 10 ఏళ్ల జైలు శిక్ష విధించినట్లు తీర్మానం చేసిందట.

కాగా హర్యానాలో ఫతేబాద్ జిల్లాలోని టొహానాలో ఉన్న కోర్టు ఈ సంచలన తీర్పు వెల్లడించింది.

చూశారుగా 600వందల కోసం ఆశపడితే ఏం జరిగిందో.

వీడియో వైరల్: అత్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న అల్లుడు.. ఎక్కడంటే..