కొద్దిలో టైగర్ ఎటాక్ నుంచి తప్పించుకున్న వ్యక్తి.. షాకింగ్ వీడియో వైరల్..

అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న గ్రామాలు, పట్టణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఎందుకంటే ఈ ప్రదేశాలకు అడవిలో నుంచి క్రూర మృగాలు తరచుగా వస్తుంటాయి.

అలాంటి సందర్భాల్లో ఆ అడవి మృగాలు దాడి చేసి చంపేసే ప్రమాదం ఉంది.

అయితే అదృష్టం కొద్దీ తాజాగా ఒక వ్యక్తి ఇలాంటి ప్రమాదం నుంచి కొద్దిలో తప్పించుకోగలిగాడు.

ఆ ఘటనకు సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ పర్వీన్ కస్వాన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఎక్స్‌లో పంచుకున్నారు.

"""/" / కార్బెట్ నేషనల్ పార్క్( Corbett National Park ) సమీపంలోని దట్టమైన అడవులలోకి వెళ్ళిన ఒక వ్యక్తి ప్రమాదం నుంచి అద్భుతంగా తప్పించుకున్నాడని ఈ వీడియోకి క్యాప్షన్ జోడించారు.

ఆ వీడియో ఓపెన్ చేస్తే మనకు, తెల్లవారుజామున ఓ వ్యక్తి అటవీ మార్గంలో ఒంటరిగా నడుస్తున్నట్లు కనిపిస్తుంది.

ఆ వ్యక్తి అలా నడుస్తూ ఉండగా సడన్‌గా అతనికి పది అడుగుల దూరంలో ఒక పులి ప్రత్యక్షమైంది.

అది చూడగానే ఆ వ్యక్తి స్టన్ అయ్యాడు.పులి ఆ సమయంలో రోడ్డు దాటుతుంది.

అది మనిషిని పెద్దగా గమనించకుండా వీలైనంత త్వరగా వెళ్లిపోవడానికి ప్రయత్నించింది.మనిషి మాత్రం పులి( Tiger )ని చూసి వెంటనే వెనక్కి తిరిగాడు.

"""/" / నిజానికి ఇలా వెనక్కి తిరిగితే పులులు ఎరగా భావించి వెంబడించి మరీ చంపుతాయి.

కానీ అదృష్టవశాత్తు ఆ పులి ఈ వ్యక్తిపై పెద్దగా శ్రద్ధ చూపలేదు.దాంతో అతడు బతికి బయటపడగలిగాడు.

ఈ వీడియో లక్షల వ్యూస్‌తో వైరల్ అయింది.ట్విట్టర్ యూజర్లు వివిధ రకాలుగా దీనిపై స్పందించారు.

పులి మార్నింగ్ వాక్‌కి వచ్చిందేమో అని ఒక నెటిజన్ ఫన్నీగా కామెంట్ చేశారు.

పులి ఇంకా చిన్న వయసులోనే ఉందని, దాని వయస్సు రెండు సంవత్సరాల లోపే ఉంటుందని, అందుకే అది మనిషి పై దాడి చేసేంత ధైర్యం చేయలేదని ఒకరు అన్నారు.

కార్బెట్‌లోని రామ్‌నగర్‌( Ramnagar )కు సమీపంలోని గర్జియా దేవి ఆలయం సమీపంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

గుడ్ న్యూస్: బార్బడోస్ చేరుకున్న విమానం.. గురువారం ఉదయానికి ఢిల్లీలో టీమిండియా..