ప్యాసింజర్ సీటు నుంచి కారు నడుపుతున్న వ్యక్తి.. వీడియో వైరల్..
TeluguStop.com
ఇండియన్ డ్రైవర్లకు ఉన్నటువంటి డ్రైవింగ్ స్కిల్స్ చూస్తే ఎవరైనా సరే ఆశ్చర్య పోవాల్సిందే.
మన ఇండియన్స్ ఏ ఇతర దేశస్థుడు కూడా ఊహించని రీతిలో వాహనాలను నడుపుతుంటారు.
చివరికి కుక్కలతో కూడా డ్రైవింగ్ చేయించగల ఘనత మనవారికి ఉంది.తాజాగా ఇలాంటి టాలెంటెడ్ డ్రైవర్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ గా మారింది.
"""/" /
ఈ వీడియోలో సదరు డ్రైవర్ మారుతీ ఆల్టో( Maruti Alto ) కారును ప్యాసింజర్ సీటులో కూర్చొని తన కాలితో నడుపుతున్నాడు.
వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో వైరల్‌గా మారింది."టెస్లాల్టో" అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ వీడియోలో, ఆ వ్యక్తి క్యాజువల్ గా సీటుపై పడుకుని, స్టీరింగ్ వీల్‌ని నియంత్రించడానికి తన కుడి పాదాన్ని ఉపయోగిస్తున్నట్లు కనిపించింది.
ఈ దృశ్యాలను అతని పక్కనే ప్రయాణిస్తున్న మరొక కారులోని ఓ వ్యక్తి రికార్డ్ చేశాడు.
"""/" /
"టెస్లాల్టో" అనేది టెస్లా, ఆల్టో కార్లను కలిపితే వస్తుంది, ఎలాన్ మస్క్( Elon Musk ) కంపెనీ తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల మాదిరిగానే ఈ ఆల్టో కారు ఆటోమేటిక్‌గా నడుస్తున్నట్లు వీడియో మస్క్‌ను ట్యాగ్ చేసింది,ఎక్స్‌లో వీడియో లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్స్ వచ్చాయి.
ఇలాంటి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న డ్రైవర్ల వల్లే టెస్లా భారతదేశానికి రాకపోయి ఉండవచ్చని, మస్క్ ఈ డ్రైవింగ్ నైపుణ్యాలను చూసి బెదిరిపోయి ఉంటాడని ఒకరు ఫన్నీగా కామెంట్ చేశారు.
డ్రైవింగ్ అసిస్టెంట్ అవసరం లేకుండా ఇండియన్స్ ఈజీగా కార్లను నడుపుతారని తెలిసి మస్క్ వెనకడుగు వేసి ఉంటారని మరికొందరు సరదాగా వ్యాఖ్యానించారు.
నారా బ్రాహ్మణికి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందా… అందుకే వద్దనుకున్నారా?