ఆ యువకుడు చేసిన పనికి అందరూ ఫిదా.. ఉద్యోగాల వెల్లువ!
TeluguStop.com
ఓ వ్యక్తి 33 లక్షల రూపాయల వ్యయంతో తన శరీరంపై లెక్కలేనన్ని టాటూలు వేయించుకున్నాడు.
టాటూల వల్ల ఉద్యోగం దక్కడం సులభతరం అవుతుందని అతను తెలిపాడు.ఈ వ్యక్తి పేరు కరక్ స్మిత్.
అతని వయస్సు 41 సంవత్సరాలు.యూకేలోని షెఫీల్డ్ నివాసి.
తన బాడీ ఆర్ట్ కారణంగా తనకు ఒకసారి వారంలో 7 జాబ్ ఆఫర్‌లు వచ్చాయని అతను తెలిపాడు.
కరక్ తన మొదటి టాటూను 18 సంవత్సరాల వయస్సులో వేయించుకున్నాడు.ఇప్పుడు అతను ఇద్దరు పిల్లలకు తండ్రి.
అతని శరీరంపై 90 శాతం మేరకు పచ్చబొట్లు ఉన్నాయి.బుగ్గలు, ముక్కు తప్ప అతని శరీరంలో అన్నిచోట్లా టాటూలు ఉన్నాయి.
ప్రస్తుతం, కరక్ సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు.అనాధ పిల్లలకు సరైన దిశానిర్దేశం చేయడంలో అతను సహాయం చేస్తాడు.
అతను మాట్లాడుతూ నాకు ఉద్యోగం రాదని నా చుట్టుపక్కలవారు వ్యాఖ్యానించేవారు.కానీ నేనెప్పుడూ నిరుద్యోగిగా లేను.
నేను 18 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటి నుండి పని చేస్తున్నాను.నాకు ఒకే వారంలో 7 జాబ్ ఆఫర్లు వచ్చిన రోజులు కూడా ఉన్నాయి.
నా టాటూల వల్లనే నాకు ఉద్యోగం వచ్చిందని కొన్నిసార్లు అనిపిస్తుంది.ఎందుకంటే నేను సాధారణ సామాజిక కార్యకర్త కంటే భిన్నంగా కనిపిస్తాను.
"""/"/
చాలామంది నాకు మెసేజ్ చేసి నేను ఏ పని చేస్తాను అని అడుగుతారు? ఎందుకంటే వాళ్లు కూడా టాటూ వేయించుకోవాలనుకుంటారన్నాడు.
టాటూల కారణంగా అతనికి అనేక రకాల ఉద్యోగాలు వచ్చాయి.వాటిలో మోడలింగ్ లాంటివి ఉన్నాయి.
అతను ప్రముఖ టీవీ షో టాప్ బాయ్‌లో కనిపిస్తూనే ఉన్నాడు.లైవ్ కన్వెన్షన్స్‌లో ఉచితంగా చాలా టాటూలు వేయించుకున్నానని కరక్ తెలిపాడు.
అతని గన శరీరంపై టాటూలు వేయించుకోవడానికి 33 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు.
హరీష్ శంకర్ నిర్మాత గా కిరణ్ అబ్బవరం సినిమా రాబోతుందా..?