మనిషిని మోసుకెళ్లే డ్రోన్.. త్వరలో ఎయిర్ ట్యాక్సీలు రెడీ..

మహారాష్ట్రలోని పూణెకు చెందిన స్టార్టప్ దేశంలోనే తొలి ప్యాసింజర్ డ్రోన్ ‘వరుణ’ను తయారు చేసింది.

భారత నౌకాదళం కోసం ఈ ప్రత్యేక డ్రోన్ ని రూపొందించారు.ఈ పైలట్ లెస్ డ్రోన్ 130 కిలోల బరువును మోయగలదు.

అంటే ఈ డ్రోన్ మనిషిని కూడా మోసుకెళ్లగల సామర్థ్యం కలిగి ఉంది.130 కిలోల బరువుతో ఈ డ్రోన్ 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు.

దీనిని సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ కంపెనీ తయారు చేసింది.ఈ డ్రోన్ ప్రత్యేకత: ఈ డ్రోన్ ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తనంతట తానుగా వెళ్తుంది.

ఇది రిమోట్ గా ఆపరేట్ చేయబడుతుంది.గాలిలో ఉన్న సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా.

వాతావరణం సరిగ్గా లేకపోయినా ఈ డ్రోన్ సురక్షితంగా ల్యాండ్ అయ్యే విధంగా ఆటోమెటిక్ గా పారాచూట్ తెరుచుకుంటుంది.

మారుమూల ప్రాంతాలు, సమస్యాత్మక ప్రదేశాలు, విపత్తులు సంభవించిన ప్రాంతాల నుంచి వ్యక్తులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చే విధంగా దోహదపడుతుందని కంపెనీ వ్యవస్థాపకుడు బబ్బర్ పేర్కొన్నారు.

అంతేకాదు కదులుతున్న నౌకపై నుంచి ఏదైనా వస్తువులను మరో ఓడపై దించగలదు.ఈ డ్రోన్ రక్షణ దళాలకు ఎక్కువగా ఉపయోగపడుతుందని బబ్బర్ తెలిపారు.

"""/"/ ‘వరుణ’ డ్రోన్ ని ఎయిర్ అంబులెన్సన్ గా కూడా ఉపయోగించవచ్చు.అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి రోగిని ఈ డ్రోన్ సహాయంతో ఆస్పత్రికి తరలించవచ్చు.

వాయు మార్గంలో వెళ్తే సమయం ఆదా అవుతుంది.రోడ్డుపై ప్రయాణానికి గంట సమయం పడితే.

అదే డ్రోన్ ద్వారా 15 నుంచి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు.రానున్న మూడు, నాలుగేళ్లలో ఈ వరుణ డ్రోన్ ని ఎయిర్ ట్యాక్సీగా ఉపయోగించవచ్చని బబ్బర్ తెలిపారు.

సమయాన్ని, ఖర్చును ఆదా చేయడానికి డ్రోన్లను ఎయిర్ ట్యాక్సీలుగా ఉపయోగించడంపై ప్రపంచ వ్యాప్తంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బంగాళదుంప సాగు చేసే నేల తయారీ విధానం.. నీటి యాజమాన్య పద్ధతులు..!