విడ్డూరం : సరదా కోసం పెట్టుకున్న కొమ్ములు ఆ తర్వాత ఎంత పని చేశాయో తెలిస్తే కన్నీళ్లు వచ్చేలా నవ్వుతారు
TeluguStop.com
కొన్ని సార్లు సరదాకు చేసిన పనులు సీరియస్ అవుతూ ఉంటాయి.ప్రాణాల మీదకు తెచ్చే సందర్బాలు కూడా చవిచూడాల్సి వస్తుంది.
ఆ పరిస్థితిని ఎవరికైనా చెప్పినా అంతా విచిత్రంగా చూస్తారు.తాము అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాము అంటే ఆ తర్వాత వారే నవ్వుకుంటారు.
ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక విషయం కూడా అలాంటిదే.ఆమె చేసిన పనికి ఆమె జీవితాంతం నవ్వుకుంటుంది.
కాని ఆ సమయంలో ఆమె పడ్డ బాధ మామూలుది కాదు.ప్రాణాలు పోతాయా అన్నట్లుగా ఆమె బాధపడింది.
"""/"/
పూర్తి వివరాల్లోకి వెళ్తే.స్కాట్‌లాండ్‌కు చెందిన కన్నీ కిర్వాన్ అనే మహిళ విషయంలో ఈ సంఘటన జరిగింది.
కన్నీ కిర్వాన్ మేకప్ ఆర్టిస్టు.ఆమె స్టేజ్‌పై ప్రదర్శణలు ఇచ్చే టీంలో ఒక సభ్యురాలు.
ఆమె తన టీంతో తర్వాత స్టేజ్ షోకు సిద్దం అవుతుంది.ప్రాక్టీస్ సందర్బంగా ఆమె పాత్రకు సంబంధించిన కొమ్ములు పెట్టుకోవాలనుకుంది.
ఆ డ్రామాలో కన్నీ ఒక దెయ్యం పాత్రను పోషిస్తూంది.ఆ దెయ్యానికి కొమ్ములు ఉంటాయి.
ఆ కొమ్ములు కాస్త సహజంగా ఉండాలే ఉద్దేశ్యంతో ఖర్చు కాస్త ఎక్కువ అయినా పర్వాలేదు అని కొనుగోలు చేసి గమ్‌తో అతికించుకుంది.
అంతకు ముందు ఆమె ఎప్పుడు ఇలాంటి ప్రయోగాలు ప్రయత్నాలు చేయలేదు.కాని ఆమె ఈసారి చేసిన ప్రయత్నం వికటించింది.
ఆమె గమ్‌తో కొమ్ములు అతికించుకుంది.కాని అది ఎంతకు ఊడలేదు.
ప్రాక్టీస్ అంతా పూర్తి అయిన తర్వాత కొమ్ములను తొలగించేందుకు ప్రయత్నించింది.కాని సాధ్యం కాలేదు.
చాలా సమయం ఆ కొమ్ములను గుంజెందుకు ప్రయత్నించగా నొప్పి లేస్తుంది తప్ప రావడం లేదు.
దాంతో స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పగా ఆమె వచ్చింది.ఆమె వచ్చిన తర్వాత కూడా చాలా సమయం రాలేదు.
దాదాపుగా రెండు గంటలు ప్రయత్నించగా అప్పుడు వచ్చాయి.అయితే ఆ కొమ్ములు ఊడిన వద్ద చర్మ పొట్లిపోయి రక్తం కారింది.
ఆమె సరదాగా చేసిన పని ఏకంగా ఇంత పనైంది.
డబ్బు కోసమే రోడ్డుపై డాన్స్ చేశాను…. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నటి వరలక్ష్మి!