కలికాలం.. భార్యను ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. వీడియో వైరల్!
TeluguStop.com
బిహార్‌లోని సహర్సాలో(Saharsa, Bihar) ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.ముగ్గురు పిల్లల తల్లి తన ప్రియుడిని పెళ్లాడింది.
ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ పెళ్లిని స్వయంగా ఆమె మొదటి భర్తే జరిపించాడు! ఆ మహిళకు మొదటి భర్తతో 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది.
అయితే, కాలక్రమేణా ఆమెకు మరో వ్యక్తితో సంబంధం ఏర్పడింది.ఆ వ్యక్తికి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు.
సాధారణంగా ఇలాంటి విషయాల్లో గొడవలు, వివాదాలు జరుగుతుంటాయి.కానీ, ఆ మహిళ మొదటి భర్త మాత్రం చాలా విభిన్నంగా స్పందించాడు.
ఎలాంటి గొడవలకు తావు లేకుండా, శాంతియుతంగా విడాకులు(Divorce) ఇచ్చాడు.అంతేకాదు, తన భార్యకు ఆమె ప్రియుడితో స్వయంగా పెళ్లి జరిపించాడు.
పెళ్లి సమయంలో, ఆ మహిళ ప్రియుడు (Woman's Lover)ఆమె నుదుటిన సింధూరం దిద్దాడు.
ఈ వేడుకకు మొదటి భర్త కూడా హాజరయ్యాడు.భవిష్యత్తులో ఏ సమస్యలు వచ్చినా, అది కొత్త జంట బాధ్యత అని, తాను వారి వ్యవహారాల్లో జోక్యం చేసుకోనని స్పష్టం చేశాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో 'ఘర్ కే కలేష్' ('Ghar Ke Kalesh')అనే సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, క్షణాల్లో వైరల్ అయింది.
ఏకంగా 5.5 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతోంది.
"బిహార్‌లోని సహర్సాలో ముగ్గురు పిల్లల తల్లి, 12 ఏళ్ల ప్రేమ వివాహాన్ని వదిలి ఇద్దరు పిల్లల తండ్రిని పెళ్లాడింది" అంటూ క్యాప్షన్ పెట్టడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
"""/" /
కొందరైతే ఫుల్ జోక్స్‌తో రెచ్చిపోతున్నారు."బ్రో నిజంగా 'వదిలేయడమే ప్రేమ' అనే ఫిలాసఫీని సీరియస్‌గా తీసుకున్నాడు!" అంటూ కామెంట్లు పెడుతున్నారు.
"బీహార్ ఒక వింత ప్రపంచంలా ఉంది" అని మరికొందరు అంటున్నారు.ఇంకొందరైతే, "విడాకులు తీసుకోవడం కంటే ఇదే ఈజీ అని భర్త అనుకున్నాడేమో" అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
అయితే, ఈ ఘటనపై విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి."మనం భవిష్యత్ తరాలకు ఎలాంటి ఆదర్శాలు ఇస్తున్నాం?" అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
కలికాలం ఇలా ఉండక ఇంకా ఎలా ఉంటుంది అని ఇంకొంతమంది ప్రశ్నిస్తున్నారు. """/" /
ఇలాంటి ఘటనలు బీహార్‌లో కొత్తేమీ కాదు.
గతంలో లఖిసరాయిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.అక్కడ ఓ భర్త, తమకు మూడేళ్ల వివాహ బంధం, ఒక చిన్న పాప ఉన్నప్పటికీ, తన భార్యకు ఆమె చిన్ననాటి ప్రియుడితో ఉన్న సంబంధం గురించి తెలుసుకుని, స్వయంగా వారికే పెళ్లి జరిపించాడు.
ఇలాంటి ఘటనలు సమాజంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
వీరయ్యను మించేలా డాకు మహారాజ్.. నాగవంశీ అంచనాలను పెంచారుగా!