ఈ జాతి కుక్కలు పెంచుకోవడానికి లైసెన్స్ తప్పనిసరి.. అనుమతి లేకుంటే!

మనలో చాలామంది జంతు ప్రేమికులు వుంటారు.ముఖ్యంగా కుక్కల్ని వీరు ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ వుంటారు.

ఈ క్రమంలో రకరకాల జాతులకు సంబంధించినటువంటి కుక్కల్ని వీరు కలెక్టివ్ గా పెంచుకోవడానికి ఇష్టపడతారు.

అయితే ఈ క్రమంలో కొన్ని రకాల జాతుల కుక్కల్ని పెంచుకోవడానికి లైసెన్స్ ఉండాలనే విషయం వీరు మర్చిపోతారు.

దాంతో అనేకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఈ క్రమంలో ఇకపోతే ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో ఓ కొత్త నిబంధనను అమల్లోకి తేనున్నారు అక్కడి అధికారులు.

విషయం ఏమంటే, అక్కడ నివసించేవారు ఎవరైనా ఇంట్లో కుక్కను పెంచుకోవాలంటే.లైసెన్స్ తీసుకోవాలని తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు.

దానికి కారణం, అక్కడ పెంపుడు కుక్కలు స్థానికంగా పెద్ద సమస్యగా మారాయి.ఈమధ్య కాలంలో వరుస దాడులతో స్థానికుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా మరో 3 రకాల శునక జాతులు అయినటువంటి పిట్ బుల్, రాట్ వీలర్, డోగో అర్జెంటినో వంటి జాతులను పెంచుకోవడాన్ని అక్కడి ప్రభుత్వం నిషేధించింది.

ఎవరైనా ఈ జాతి కుక్కలను కొనుగోలు చేస్తే అందుకు పూర్తి బాధ్యత వారే వహించాలని ఘజియాబాద్ బీజేపీ నేత, కౌన్సిలర్ సంజయ్ సింగ్ తాజాగా తెలిపారు.

"""/"/ ఇకపోతే, ఫారిన్ కంట్రీలలో ఈ లైసెన్స్ అనేది ఎప్పటినుండో నడుస్తోంది.మనదగ్గర ఈమధ్య కాలంలో స్టార్ట్ అయింది.

ముఖ్యంగా అది ఈ రాష్ట్రము నుండే మొదలు కానుందని తెలుస్తోంది.ఇక్కడ మరో 2 నెలల వ్యవధిలో లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి అని భోగట్టా.

ఇక ఎత్తయిన అపార్ట్ మెంట్లలో ఉండేవారు తమ శునకాలను సర్వీస్ లిఫ్ట్ ల్లోనే తీసుకెళ్లాలి.

కామన్ లిఫ్ట్ లో అస్సలు తీసుకెళ్లకూడదు.బయటకు తీసుకువెళుతుంటే వాటి మూతికి ఖచ్చితంగా కవచం అనేది ధరించాలి.

లేదంటే ఫైన్ తప్పనిసరి.

వేలు పెట్టకుండా ఉంటే దేవర లాంటి ఫలితాలే వస్తాయి… ప్రముఖ రచయిత షాకింగ్ కామెంట్స్!