భారీ సంఖ్యలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దైవ దర్శనానికి బయలుదేరిన బొప్పాపూర్ గ్రామస్తులు

20 బస్సులు,15 తుపాన్లు, 5 స్వంత కార్లు లో బయలుదేరిన గ్రామస్తులు పిల్లాపాపలతో కలిసి సుమారు 1600 మంది బయలుదేరారు సిద్దిపేటలో టిఫిన్లు ఏర్పాటు దైవదర్శనం అనంతరం యాదగిరిగుట్టలో భోజన వసతి యాత్రకు వచ్చిన ప్రతి ఒక్కరికి లక్ష్మీ నరసింహ స్వామి ప్రసాదం అందించనున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్( Boppapur Village ) గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి, గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చిదుగు గోవర్ధన్ గౌడ్ లు కలిసి గ్రామస్తులంతా తమ కుటుంబముగా భావించి గ్రామస్తులను యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దైవ దర్శనం చేయించాలని ఉద్దేశంతో తమ సొంత ఖర్చులతో గ్రామస్తుల కొరకు 20 బస్సులు, 15 తుఫాన్లు,5 కార్లలో పిల్లాపాపలతో కలిసి సుమారు 1600 మంది తో నేడు యాదగిరిగుట్టకు బయలుదేరారు.

గ్రామస్తులకు ఉదయం సిద్దిపేటలో టిఫిన్ లు ఏర్పాటు చేయడం జరిగింది.టిఫిన్లు చేసిన అనంతరం యాదగిరిగుట్టకు బయలుదేరి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని( Sri Lakshmi Narasimha Swamy ) దర్శించుకున్న తర్వాత గ్రామస్తులకు భోజన వసతి కూడా కల్పించారు.

గ్రామస్తులకు లక్ష్మీనరసింహస్వామి ప్రసాదం కూడా అందజేయనున్నారు.ఐదు లక్షల వరకు ఖర్చు చేసి సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి, చిదుగు గోవర్ధన్ గౌడ్( Chidugu Govardhan Goud ) లు కలిసి గ్రామస్తులకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దైవదర్శనం కల్పించారు.

గ్రామ సర్పంచ్ కొండాపురం బాల్రెడ్డి, చిదుగు గోవర్ధన్ గౌడ్ లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా చిదుగు గోవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ.కొండాపురం బాల్రెడ్డి బొప్పాపూర్ గ్రామ సర్పంచ్ అయినందుకు తనకు గర్వంగా ఉందని ప్రభుత్వం నిధులు లేకపోయినా తనను గెలిపించినందుకు వెనకడుగు వేయకుండా నిరుపేద కుటుంబాలను, ఆపదలో ఉన్న వారిని తనకు తోచినంతగా సహాయం చేసుకుంటూ ముందుకు వెళుతున్నారని, సర్పంచ్ పదవులో ఉండి చిల్లి గవ్వ కూడా ఆశించకుండా తన సంపాదనను గ్రామ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి ఎలాంటి ఆపద వచ్చిన ముందుండి నిస్వార్థంతో ముందుకెళుతున్నారని, ఇలాంటి సర్పంచులు ఉంటే గ్రామాలు బాగుపడతాయని, అవకాశమస్తే మళ్లీ కొండాపురం బాల్రెడ్డిని బొప్పాపురం సర్పంచ్ గా గెలిపించాలని తెలిపారు.

ఉదయం పూట ఒక గ్లాసు మజ్జిగ తాగితే ఏం జరుగుతుందో తెలుసా?